తొమ్మిదేళ్ల ప్రేమ.. ఈ రోజుతో ఒక్కటయ్యాం: జబర్దస్త్ ఫైమా సర్‌ప్రైజ్ | Jabardasth comedian Faima Finally Married his lover after 9 years of love | Sakshi
Sakshi News home page

Faima: జబర్దస్త్ ఫైమా ప్రేమ పెళ్లి.. ఎమోషనల్‌ జర్నీ అంటూ పోస్ట్

Jun 24 2026 5:11 PM | Updated on Jun 24 2026 6:00 PM

Jabardasth comedian Faima Finally Married his lover after 9 years of love

జబర్దస్త్ షోతో ఫేమస్ అయినవాళ్లలో ఫైమా ఒకరు. తన కామెడీ పంచ్‌లతో అభిమానులను ఆకట్టుకుంది. బిగ్‌బాస్ గత సీజన్‌లో ఆడే అవకాశం దక్కించుకుని మంచిగా సెటిలైపోయింది. తాజాగా ఫైమా ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను ఫైమా పెళ్లాడింది. తామిద్దరం తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నామని తెలిపింది. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఈ రోజు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టామని ఫైమా సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సహచరులు ఫైమాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఫైమా తన ఇన్‌స్టాలో రాస్తూ..' వారు మమ్మల్ని అనుమానించారు. మమ్మల్ని విమర్శించారు.  విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకినీ అధిగమించి బలంగా నిలిచింది. లెక్కలేనన్ని పోరాటాలు. అంతులేని సహనం. వదిలేయడానికి వేయి కారణాలున్నా.. మేము ప్రతిరోజూ ఒకరినొకరు ఎంచుకున్నాం. ఫైనల్‌గా ఈ రోజు మేము భార్యాభర్తలం అయ్యాం' ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement