Rashmika-Tamannaah: తమన్నాతో కలిసి భారీ స్కెచ్‌ వేసిన రష్మిక.. ప్లానింగ్‌ మామూలుగా లేదుగా!

IPL 2023 Opening Ceremony: Rashmika And Tamannah To Perform - Sakshi

మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ హీరోలు కలిసి నటించటం కామన్ అయిపోయింది. ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను చూసి ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయి చేస్తున్నారు. ఇక ఈ ఫార్మూలను హీరోయిన్ల విషయంలో కూడా అప్లై చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత టి.టౌన్ బ్యూటీస్ కి నేషనల్ వైడ్ ఇమేజ్ వచ్చింది. దీంతో నేషనల్ వైడ్ పాపులారిటీని  సంపాదించుకున్న ఇద్దరు భామలు కలిసి వరల్డ్ వైడ్ గా సందడి చేసేందుకు రెడీ అయ్యారు.

బాహుబలి తో తమన్నా...పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్స్ గా మారిపోయారు. రీసెంట్ గా నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అమితాబ్ తో కలిసి గుడ్ బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మికకి ఆ సినిమా అంతగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఓటిటి లో రిలీజైన మిషన్‌ మజ్ను కూడా రష్మికకి హిట్ ఇవ్వలేకపోయింది.

ప్రజెంట్ రష్మిక సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తుంది. రణవీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమాపై రష్మిక భారీ ఆశలే పెట్టుకుంది. ఇక తెలుగులో నితిన్ -వెంకీ కుడుముల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక...తమన్నాతో కలిసి ఓ భారీ స్కెచ్ వేసింది.

బాహుబలితో తమన్నా రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియాలో రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత తమన్నా బి.టౌన్ పై కన్నేసింది. ఓటిటిలో వెబ్ సిరీస్ లు చేస్తూనే...హిందీ మూవీ ఆఫర్స్ కోసం గట్టిగానే ట్రై చేసింది. ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌవుట్ కాలేదు. ఇప్పుడు రష్మిక తో కలిసి వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపేందుకు రెడీ అయింది.

ఈ నెల 31నుంచి ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభం కానుంది. గత నాలుగేళ్లుగా కరోనా సందర్భంగా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెరిమనీ జరగటం లేదు. ఈ ఏడాది ఇండియాలో జరిగే ఈ ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ వేడకను గ్రాండ్ నిర్వహించేందుకు బిసిసిఐ ప్లాన్ చేసింది. 2018లో ఓపెనింగ్ సెరిమనీ జరింగింది అంతే. ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్ లో ఓపెనింగ్ సెరిమనీ జరగలేదు.

2018లో జరిగిన ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీ లో పరిణీతి చోప్రా, వరుణ్ ధవన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హృతిక్ రోషన్ పెర్‌ఫార్మ్ చేశారు.ఈ ఇయర్ జరగబోయే ఐపీఎల్ సీజన్ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ అంతకు మించి అనేలా ప్లాన్ చేసింది బిసిసిఐ. ఇప్పటి వరకు ఈ వేదిక బాలీవుడ్ స్టార్స్ మాత్రమే సందడి చేశారు. అలాగే టాలీవుడ్ నుంచి ఈ వేదిక పై ఫస్ట్ టైమ్ పెర్ఫార్మ్ చేయబోతున్నారు నేషనల్ క్రష్ రష్మిక, మిల్కీబ్యూటీ తమన్నా.. ఇప్పటికే వీరితో బిసిసిఐ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక వీరు కూడా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెరిమనీలో డ్యాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక రష్మిక ఈ వేదిక పై ఫుష్ప లోని సామీ సామీ పాటకి డ్యాన్స్ చేసే అవకాశం వుంది. తమన్నా ఏ పాటకు డ్యాన్స్ చేస్తుందనే డీటైయిల్స్ ఇంకా తెలియలేదు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెరిమనీలో దిశా పటాని, టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమీ జాక్సన్, శ్రద్ధా కపూర్ వంటి టాప్ బాలీవుడ్ సెలెబ్రిటీస్ మాత్రమే పెర్‌ఫార్మ్ చేశారు. ఈ లిస్ట్ లో తమన్నా, రష్మిక మందన్న చేరటంతో వారి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top