స్టార్ హీరో ఖర్చు.. అతడికి ప్రతినెలా రూ.20 లక్షలు! | Hrithik Roshan Gym Trainer Kris Gethin Fee Details | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్ కోసం కోట్ల ఖర్చు.. స్టార్ హీరోది పెద్ద ప్లానింగే!

Aug 31 2023 9:25 PM | Updated on Aug 31 2023 9:28 PM

 Hrithik Roshan Gym Trainer Kris Gethin Fee Details - Sakshi

ఆ హీరో వయసు 50 ఏళ్లు. కానీ అస్సలు అలా కనిపించడు. సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు. యాక్షన్ సీన్స్, గ్రేస్‌తో స్టెప్పులు వేయాలంటే ఆ ఇండస్ట్రీలో మనోడి తర్వాత ఎవరైనా. ఒక్కో సినిమాకు కోట్లకు కోట్లు తీసుకునే ఇతడు.. ఫిట్‌నెస్ కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? ఏంటి సంగతి?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు చెప్పగానే చాలామందికి క్రిష్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగు ప్రేక్షకులకు అలా బాగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం హిందీలో యాక్షన్ తరహా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇద్దరు పిల్లలకు తండ్రి అయినప్పటికీ.. బాడీ మంచి షేప్‌లో ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. డైలీ వర్కౌట్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోడు.

(ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇ‍ప్పుడు లాయర్‌గా!)

అయితే తన బాడీ ఫిట్, షేప్‌లో ఉండటం కోసం పర్సనల్‌గా ట్రైనర్ క్రిస్ గెతిన్ అనే ఫారెనర్ ని పెట్టుకున్నాడు. అయితే ఇతడికి ప్రతినెలా దాదాపు రూ.20 లక్షల మొత్తాన్ని ఫీజుగా చెల్లిస్తున్నాడట. ఇది తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఏడాదికి లెక్కేసుకుంటే రూ.2.4 కోట్లు అనమాట. బహుశా ఫిట్‌నెస్ కోసం ఈ రేంజులో ఖర్చు పెడుతున్న స్టార్ హీరో ఇతడే అయ్యుంటాడు.

ప్రస్తుతం 'ఫైటర్' మూవీ చేస్తున‍్న హృతిక్.. దీని తర్వాత 'వార్ 2'లో నటిస్తాడు. ఇందులో హృతిక్ తో పాటు జూ.ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేస్తాడు. ఇప్పటికే ఈ కాంబో ఫిక్స్ అయింది. ఈ డిసెంబరు నుంచి షూటింగ్ మొదలు కానుండగా, తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేశారు. 2025 జనవరి 25న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..)

Advertisement
 
Advertisement
Advertisement