Hina Khan Locks Lips With Beau Rocky Jaiswal at Airport - Sakshi
Sakshi News home page

Hina Khan: పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవాల్సిన పనేంటి?.. నటి లిప్‌లాక్‌పై ట్రోల్స్

May 25 2023 6:31 PM | Updated on May 25 2023 6:44 PM

Hina Khan locks lips with beau Rocky Jaiswal at airport netizens troll actress - Sakshi

బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న ముద్దుగుమ్మ ముంబయి విమానాశ్రయంలో హల్‌చల్‌ చేసింది. సమావేశాల అనంతరం ముంబయి చేరుకున్న భామకు బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికాడు. అదే సమయంలో ఈ జంట లిప్‌లాకక్‌తో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. 

(ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్‌)

అంత త్వరగా ముద్దుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు రాస్తూ పబ్లిక్‌ ముందు ఇలా చేసినందుకు సిగ్గుపడండి అంటూ రాసుకొచ్చారు. వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు.  పబ్లిక్‌ ఇలాంటి పనులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. 

కాగా.. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్‌పై బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఆమె మాట్లాడింది. గతంలో ఈ జంట బ్రేకప్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను హీనా ఖాన్ ఖండించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!)

హీనా ఖాన్ బాలీవుడ్‌ బుల్లితెర నటిగా ఫేమ్ తెచ్చుకుంది. యే రిష్తా క్యా కెహ్లతా హైలో అక్షరా, కసౌతి జిందగీ కే 2లో కొమొలికా పాత్రలో ఆమెకు గుర్తింపు దక్కింది. ఖత్రోన్ కీ కిలాడీ, బిగ్‌ బాస్‌ లాంటి రియాల్టీ షోస్‌లో రన్నరప్‌గా నిలిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement