తిరిగొచ్చిన కాలం! | Hero Nikhil Launches Motion Poster Of Krishna Leela Movie | Sakshi
Sakshi News home page

తిరిగొచ్చిన కాలం!

Apr 11 2025 3:40 AM | Updated on Apr 11 2025 3:40 AM

Hero Nikhil Launches Motion Poster Of Krishna Leela Movie

దేవన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సూపర్‌ నేచురల్‌ లవ్‌స్టోరీ ‘కృష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహాసేన్‌ విజువల్స్‌ పతాకంపై జ్యోత్స్న.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, మోషన్‌పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హీరో నిఖిల్, ఎల్వీ గంగాధర్‌ శాస్త్రి, ఛోటా కె.నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వేడుకలో నిఖిల్‌ మాట్లాడుతూ– ‘‘దేవన్‌ మంచి ప్యాషన్‌ ఉన్న యాక్టర్, డైరెక్టర్‌. ‘హ్యాపీ డేస్‌’కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయతో నాకు ‘హ్యాపీ డేస్‌’ దొరికింది. ఆ దేవుడి దయతోనే దేవన్‌కు ‘కృష్ణ లీల’తో పెద్ద హిట్‌ రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్‌ చేసే పాయింట్స్‌ మా సినిమాలో ఉన్నాయి’’ అన్నారు జ్యోత్స్న. 

‘‘దేవన్‌ చాలా అంకితభావంతో పని చేశారు. కృష్ణుడు మొదట ప్రేమికుడు. ఎవరైతే కరెక్ట్‌గా ప్రేమించగలరో అతనికి మించి యుద్ధం చేసే వ్యక్తి ఎవరూ ఉండరు. అందుకే  ప్రేమ గురించైనా... యుద్ధం గురించైనా పేరు చెప్పాలంటే కృష్ణుని పేరే చె΄్తాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు కథా రచయిత అనిల్‌ కుమార్‌. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement