Devana
-
దేవన్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న కృష్ణలీల.. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన నిఖిల్
దేవన్, ధన్య బాలకృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ లీల. దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జ్యోత్స్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు- అనిల్ కిరణ్ కుమార్ అందించారు. ఈ సినిమాకి 'కృష్ణ లీల' అనే టైటిల్ ఖరారు చేశారు. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ఈ టైటిల్ లాంఛ్ ఈవెంట్‌కు హీరో నిఖిల్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. 'దేవన్ చాలా పాషన్ ఉన్న యాక్టర్, డైరెక్టర్. హ్యాపీడేస్‌కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయవల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దయవల్ల తనకి కృష్ణ లీలతో పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మోషన్ పోస్టరు నాకు చాలా నచ్చింది. ఇందులో దేవ్ డిఫరెంట్ సేడ్స్ నాకు చాలా నచ్చాయి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఈ టీం ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారుహీరో దేవన్ మాట్లాడుతూ. 'అందరికీ నమస్కారం.. ముందుగా మా అమ్మానాన్నలకి కృతజ్ఞతలు. నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన మా నిర్మాతలు జ్యోత్స్న, అనిల్ గారికి ధన్యవాదాలు. వారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. చోటా కె నాయుడు ఇష్టమైన కెమెరామెన్. ఆయనతో కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఫైనల్‌గా ఆయనని కలిసి ఈ సినిమా కథ చెప్పా. ఈ జర్నీ ఒక మిరాకిల్‌లా మొదలైంది. గంగాధర్ శాస్త్రికి ఈ సినిమా కథ చెప్పాను. ఆయన నాకు విలువైన సూచనలు ఇచ్చారు. 18 పేజేస్ నుంచి అఖిల్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన చూసిన తర్వాత మరింత ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈవెంట్ కొచ్చి మాకు సపోర్ట్ చేసిన నిఖిల్ అన్నకి థాంక్యూ సో మచ్' అని అన్నారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్స్ సరయు, ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
తిరిగొచ్చిన కాలం!
దేవన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సూపర్ నేచురల్ లవ్‌స్టోరీ ‘కృష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మహాసేన్ విజువల్స్ పతాకంపై జ్యోత్స్న.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, మోషన్‌పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో నిఖిల్, ఎల్వీ గంగాధర్ శాస్త్రి, ఛోటా కె.నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు.ఈ వేడుకలో నిఖిల్ మాట్లాడుతూ– ‘‘దేవన్ మంచి ప్యాషన్ ఉన్న యాక్టర్, డైరెక్టర్. ‘హ్యాపీ డేస్’కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయతో నాకు ‘హ్యాపీ డేస్’ దొరికింది. ఆ దేవుడి దయతోనే దేవన్‌కు ‘కృష్ణ లీల’తో పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ చేసే పాయింట్స్ మా సినిమాలో ఉన్నాయి’’ అన్నారు జ్యోత్స్న. ‘‘దేవన్ చాలా అంకితభావంతో పని చేశారు. కృష్ణుడు మొదట ప్రేమికుడు. ఎవరైతే కరెక్ట్‌గా ప్రేమించగలరో అతనికి మించి యుద్ధం చేసే వ్యక్తి ఎవరూ ఉండరు. అందుకే ప్రేమ గురించైనా... యుద్ధం గురించైనా పేరు చెప్పాలంటే కృష్ణుని పేరే చె΄్తాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు కథా రచయిత అనిల్ కుమార్. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్. -
నీడ ఏం చేస్తుంది?
‘నీడ’లు రెండు రకాలు. ఒకటి కాపాడే నీడ. రెండోది వెంటాడే నీడ. ఈ రెండిటికీ మధ్య జరిగిన సంఘర్షణలో ఓ అమ్మాయి ఎలాంటి వ్యథను అనుభవించింది. అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘నీడ’. అనూజ్రామ్, దేవన జంటగా నటించారు. జె.ఎస్.చౌదరి దర్శకుడు. వెలువోలు శ్రీనివాసరావు నిర్మాత. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. సినిమా బాగా వచ్చిందని, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. తెలుగుతో పాటు కర్నాటకలో కూడా విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ తర్వాత సంగీత దర్శకునిగా సంతృప్తినిచ్చిన సినిమా ఇదని విజయ్ కూరాకుల చెప్పారు. రవిబాబు, పృథ్వీ, సంధ్యా జనక్, అంబటి శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: గారపాటి శ్రీనివాస్, వెలువోలు సురేష్, కొడాలి రవికుమార్.