నీడ ఏం చేస్తుంది? | What does the shadow | Sakshi
Sakshi News home page

నీడ ఏం చేస్తుంది?

Sep 12 2013 1:13 AM | Updated on Sep 1 2017 10:37 PM

నీడ ఏం చేస్తుంది?

నీడ ఏం చేస్తుంది?

‘నీడ’లు రెండు రకాలు. ఒకటి కాపాడే నీడ. రెండోది వెంటాడే నీడ. ఈ రెండిటికీ మధ్య జరిగిన సంఘర్షణలో ఓ అమ్మాయి ఎలాంటి వ్యథను అనుభవించింది. అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘నీడ’. అనూజ్‌రామ్, దేవన జంటగా నటించారు. జె.ఎస్.చౌదరి దర్శకుడు.

 వెలువోలు శ్రీనివాసరావు నిర్మాత. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. సినిమా బాగా వచ్చిందని, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని  దర్శకుడు చెప్పారు. తెలుగుతో పాటు కర్నాటకలో కూడా విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. 
 
 ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ తర్వాత సంగీత దర్శకునిగా సంతృప్తినిచ్చిన సినిమా ఇదని విజయ్ కూరాకుల చెప్పారు. రవిబాబు, పృథ్వీ, సంధ్యా జనక్, అంబటి శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: గారపాటి శ్రీనివాస్, వెలువోలు సురేష్, కొడాలి రవికుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement