టాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్ | tollywood romantic Love story Kagitham Padavalu song release | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Sep 1 2026 10:15 PM | Updated on Sep 1 2026 10:17 PM

tollywood romantic Love story Kagitham Padavalu song release

వర్ధన్, కృష్ణప్రియ జంటగా వస్తోన్న మూవీ కాగితం పడవలు. ఈ చిత్రాన్ని రొమాంటిక్‌ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా హీరో వర్ధన్ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. కాగితం పడవలు.. ఒక కాలువలో ప్రయాణం చేయాలని అనుకున్నాం. తెలియకుండానే ఒక సముద్రంలోకి వచ్చేశాం. ఎన్నోసార్లు ఒడ్డుకు వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం. డైరెక్టర్ తుకారాం చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ 18న థియేటర్స్‌లో కలుద్దాం' అని అన్నారు.

దర్శకుడు తుకారాం మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. మా సినిమాకి మా నిర్మాతలే హీరోలు. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీ ప్రేమకథ మీకు గుర్తుకొస్తుంది. మీరందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు.

హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ..' తెలుగులో కాగితం పడవలు నా రెండో సినిమా. మా నిర్మాతలందరికీ థాంక్యూ. మా డైరెక్టర్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్‌లో నటించాను. మా హీరోకి థాంక్యూ. సెప్టెంబర్ 18న సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు. కాగా.. సెప్టెంబర్ 18న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement