హరిహర వీరమల్లుపై ట్రోలింగ్‌.. పంచతంత్రం సీరియల్‌ బెటర్‌! | Harihara Veeramallu Movie: Social Media Users Criticizing Poor VFX | Sakshi
Sakshi News home page

హరిహర వీరమల్లుపై ట్రోలింగ్‌.. ఆ సీన్లేంట్రా బాబూ! ప్రేక్షకులకు తలనొప్పి గ్యారెంటీ!

Jul 24 2025 7:12 PM | Updated on Jul 24 2025 8:06 PM

Harihara Veeramallu Movie: Social Media Users Criticizing Poor VFX

హరిహర వీరమల్లు (Harihara Veeramallu Movie).. ఐదేళ్ల కిందట మొదలైన సినిమా! ఎన్నో ఆలస్యాల తర్వాత జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లుకు ఎటువంటి బజ్‌ లేకపోయేసరికి హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోషన్‌ చేసుకుంది. అసలే నిర్మాత పెట్టిన డబ్బులు వస్తాయో, లేదోనన్న భయంతో నిలువునా వణికిపోతున్నాడు. 

ఏం లాభం?
అతడి బాధ అర్థం చేసుకుందో, ఏమోకానీ కెరీర్‌ను పక్కనపెట్టి మరీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంది నిధి. తననలా చూశాక పవన్‌ కల్యాణ్‌కు బుద్ధి వచ్చినట్లుంది. సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్న నిధిని చూస్తే సిగ్గేసిందంటూ వెంటనే ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అయినా లాభం లేదనుకోండి, అది వేరే విషయం!

(చదవండి: హరిహర వీరమల్లు మూవీ రివ్యూ)

అభిమానులకే నచ్చట్లేదు
పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమా అనగానే అభిమానులు నానా హడావుడి చేశారు. కానీ సాయంత్రమయ్యేసరికి దాదాపుగా సైలెంట్‌ అయిపోయారు. కొందరు అభిమానుల నుంచి కూడా సినిమాకు నెగెటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుంది వారి పరిస్థితి! హరిహర వీరమల్లు వరస్ట్‌గా ఉంది.. ఓజీ సినిమాకు చూసుకుందాంలే అని వారే ఒప్పేసుకుంటున్నారు.

పేలవమైన వీఎఫ్‌ఎక్స్‌
ముఖ్యంగా రూ.250 కోట్ల బడ్జెట్‌ అన్నప్పుడు వీఎఫ్‌ఎక్స్‌ కూడా దానికి తగ్గట్లే ఉండాలి. కానీ ఈ చిత్రంలో కొన్ని పేలవమైన గ్రాఫిక్స్‌ సినీప్రియులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. సినిమా అంత కలగూర గంపలా కనిపిస్తుంది. సినిమా కంటే తక్కువ.. సీరియల్‌ కంటే ఎక్కువ అని నెటిజన్లు హరిహరవీరమల్లును ట్రోల్‌ చేస్తున్నారు. సినిమాలో పవన్‌.. కోహినూర్‌ వజ్రాన్ని తేవడం ఏమో కానీ ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత తలనొప్పి అందించారు. బహుశా అందుకునేమో.. నిర్మాత రత్నం ఈ సినిమా హిట్టయితేనే పార్ట్‌ 2 ఉంటుందని థియేటర్‌ బయట నెమ్మదిగా జారుకున్నాడు.

 

చదవండి: నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement