మళ్లీ పాడారు | Hari Hara Veera Mallu song Maata Vinali, sung by Pawan Kalyan | Sakshi
Sakshi News home page

మళ్లీ పాడారు

Jan 2 2025 5:09 AM | Updated on Jan 2 2025 5:09 AM

Hari Hara Veera Mallu song Maata Vinali, sung by Pawan Kalyan

‘తమ్ముడు, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ వంటి సినిమాల తర్వాత హీరో పవన్‌ కల్యాణ్‌ మరోసారి పాట పాడారు. ఆయన టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌–1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ చిత్రంలోని ‘మాట వినాలి...’ అనే పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్‌. పెంచల్‌దాస్‌ సాహిత్యం అందించిన ఈ పాటను పవన్‌ కల్యాణ్‌ పాడారు. నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా, బాబీ డియోల్, అనుపమ్‌ ఖేర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు పార్ట్‌–1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement