స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి? | Sakshi
Sakshi News home page

హీరోయిన్ కమ్ విలన్‌పై పెళ్లి రూమర్స్.. అదే అసలు కారణమా?

Published Tue, Jan 30 2024 12:35 PM

Hanuman Actress Varalaxmi Sarathkumar Marriage Rumours With Simbu - Sakshi

'హనుమాన్' సినిమా చూశారా? మీలో చాలామంది చూసే ఉంటారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరూ అద్భుతంగా చేశారు. అలానే హీరో అక్కగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నంతలో అదరగొట్టేసింది. ఈ మధ్య తెలుగు చిత్రాల్లో మంచి మంచి రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ఈ నటి.. 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె వివాహంపై రూమర్స్ వచ్చాయి. ఏకంగా ఓ స్టార్ హీరోతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్)

అసలేం జరిగింది?
వరలక్ష్మి.. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. తండ్రిలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తొలుత హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొన్నాళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేక పాత్రలు చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె గతంలో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. అందులో నిజం పక్కనబెడితే ఇప్పటికీ వీళ్లిద్దరూ సింగిల్‌గానే ఉండిపోయారు.

నిజమెంత?
ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ధనుష్‌తో పెళ్లి ఉండొచ్చని అన్నారు. ఇప్పుడేమో తమిళ స్టార్ హీరో శింబుతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. వరలక్ష్మిలానే శింబు కూడా సింగిల్‌గా ఉండటంతో ఈ వదంతులు వచ్చాయి. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)

Advertisement
 
Advertisement
 
Advertisement