సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్ | Sakshi
Sakshi News home page

Padma Soorya: బన్నీ విలన్‍‌కి పెళ్లి అయిపోయింది.. అమ్మాయి ఎవరంటే?

Published Sun, Jan 28 2024 10:02 AM

Actor Padmasoorya Married Gopika Anil - Sakshi

తెలుగులో పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన నటుడు పెళ్లి చేసుకున్నాడు. సీరియల్ హీరోయిన్‌తో ఏడడుగు వేశాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తోటి నటీనటులు.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ వీళ్లెవరు? వీళ్లది ప్రేమ వివాహమా?  అనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిపోయిన తమన్నా.. అందుకే ఇలా కనిపించిందా?)

మలయాళ నటుడు పద్మ సూర్య.. సొంత ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 తదితర సినిమాల్లో హీరోగా చేశాడు. మరోవైపు తెలుగులోకి 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విలన్ కొడుకుగా చేసింది ఇతడే. దీని తర్వాత బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ తదితర సినిమాల్లో ప్రతినాయక ఛాయలున్న రోల్స్ చేశాడు. మలయాళంలో టీవీ షోలకు హోస్ట్‌గానూ రాణిస్తున్నాడు.

ఇక పద్మసూర్య.. గతేడాది అక్టోబరులో సీరియల్ బ్యూటీ గోపిక అనిల్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీళ్లది పెద్దల కుదుర్చిన సంబంధమే. అలా ఇప్పుడు జనవరి 28న కేరళలోని వడక్కునాథన్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ విషెస్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?)

Advertisement
 
Advertisement
 
Advertisement