నా సినిమా సక్సెస్.. కష్టమంతా మరిచిపోయా: హన్సిక | Hansika Comments At 'My Name Is Shruthi' Movie Success Meet | Sakshi
Sakshi News home page

నా సినిమా సక్సెస్.. కష్టమంతా మరిచిపోయా: హన్సిక

Nov 21 2023 9:16 PM | Updated on Nov 22 2023 8:39 AM

 Hansika Comments My Name Is Shruthi Movie Success - Sakshi

బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా 'మై నేమ్ ఈజ్ శృతి'. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వం వహించగా, బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. హన్సిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం నిర్మాత, దర్శకుడు ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది జెన్యూన్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. టాక్, రేటింగ్స్‌.. మేం పడిన కష్టమంతా మరిచిపోయేలా చేశాయి. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడితో వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది అని హన్సిక చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!)

Advertisement
 
Advertisement
Advertisement