ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు | Upcoming OTT Release Movies Telugu November 4th Week 2023 | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లో ఈ వారమంతా 24 సినిమాలు రిలీజ్.. అవి మాత్రం స్పెషల్!

Nov 19 2023 11:27 PM | Updated on Nov 20 2023 8:34 AM

Upcoming OTT Release Movies Telugu November 4th Week 2023 - Sakshi

ప్రపంచకప్ అయిపోయింది. టీమిండియా ఓడిపోయింది. దీంతో సోమవారం నుంచి ఎవరి పనుల్లో వాళ్లుపడిపోతారు. మూవీ లవర్స్ మాత్రం కొత్త సినిమాల సంగతి చూద్దామని ఫిక్స్ అవుతారు. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం 'ఆదికేశవ', 'కోటబొమ్మాళి పీఎస్', 'ధృవనక్షత్రం' లాంటి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి.

(ఇదీ చదవండి: Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్‌పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!)

ఓటీటీలో ఈ వారం విడుదలయ్యే మూవీస్ చూసుకుంటే.. 'ద గుడ్ ఓల్డ్ డేస్' తెలుగు సిరీస్ తప్పితే డబ్బింగ్ బొమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'స్క్విడ్ గేమ్' సిరీస్ సెకండ్ సీజన్, 'ద విలేజ్' సిరీస్‌తో పాటు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ఒపెన్ హైమర్', తెలుగు డబ్బింగ్ మూవీ 'ఒడియన్'.. ఈ వారం రిలీజ్ అవుతున్న వాటిలో చెప్పుకోదగ్గవిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏయే మూవీస్.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (నవంబరు 20 నుంచి 26వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20
  • లియో (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 21
  • స్క‍్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22
  • మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23
  • పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23
  • ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24
  • ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24
  • లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24
  • గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24
  • ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26

అమెజాన్ ప్రైమ్

  • ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24
  • ద విలేజ్ (తమిళ సిరీస్) - నవంబరు 24

అమెజాన్ మినీ టీవీ

  • స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21
  • చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 23 (రూమర్ డేట్)

జీ5

  • ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24

జియో సినిమా

  • ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23

బుక్ మై షో

  • ఒపన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22
  • UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24

సోనీ లివ్

  • చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24
  • సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24

ఆహా

  • అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్  (ఎనిమల్ టీమ్ ఎపిసోడ్) - నవంబరు 24

ఆపిల్ ప్లస్ టీవీ

  • హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22

ఈ-విన్

  • ఒడియన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 24

(ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement