ఘట్టమనేని మంజుల తన కూతురు జాన్వీ స్వరూప్‌ను ఒక వాణిజ్య ప్రకటనతో పరిచయం చేశారు. లెజెండరీ సూపర్‌స్టార్ కృష్ణకు మనవరాలు, మహేష్ బాబుకు మేనకోడలుగా జాన్వీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆమె ఒక జువెల్లర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యారు. సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తొలిసారి జువెల్లర్స్‌కు సంబంధించిన వ్యాపార ప్రకటనలో కనిపించి మెప్పించారు.
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని కూడా జువెల్లర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాన్వీ కూడా ఈ యాడ్‌లో చాలా చక్కగా కనిపించడమే కాకుండా తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. నెటిజన్ల నుంచి కూడా ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి.
ఘట్టమనేని జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఆమె నటన, డాన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందడమే కాకుండా ఇప్పటికే ఒక స్టోరీని కూడా ఫైనల్ చేశారట. ఇక జాన్వీ తల్లి మంజుల ఘట్టమనేని సినిమా పరిశ్రమలో దర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి కొంత దూరంగా ఉన్నప్పటికీ కూతురును ప్రోత్సహిస్తున్నారు. జాన్వీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తప్పుకుండా ఘట్టమనేని అభిమానులు స్వాగతిస్తారని చెప్పవచ్చు.


