హీరోయిన్గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ
తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరొకరు వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు. మహేశ్ మేనకోడలు జాన్వీ స్వరూప్ (Jaanvi Swarup Ghattamaneni) త్వరలోనే బిగ్స్క్రీన్పై కనిపించనుంది. మహేశ్‌బాబు అక్క మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni)- సంజయ్ స్వరూప్ దంపతుల కూతురే జాన్వీ స్వరూప్. తన సినీఎంట్రీని మంజుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.ప్రపంచం ఎదురుచూస్తోంది'నా చిన్నారి జాన్వీ ఎంత ఎదిగిపోయిందో! ఇప్పుడు రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తనకు మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. అవన్నీ త్వరలోనే ప్రపంచం చూడబోతోంది. నీకోసం వెండితెర ఎదురుచూస్తోంది మై డార్లింగ్.. ఐ లవ్యూ సో మచ్. హ్యాపీ బర్త్‌డే మై జాను' అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా జాన్వి చిన్నవయసులో ఓ సినిమా చేసింది. తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది (2018) సినిమాలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఈ మూవీకి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.పేరెంట్స్ కూడా యాక్టర్సే!జాన్వీ పేరెంట్స్ మంజుల- సంజయ్ స్వరూప్ కూడా యాక్టర్సే! మంజుల.. షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగా మనసుకు నచ్చింది అని ఒకే ఒక్క మూవీ చేసింది. షో, నాని, పోకిరి, ఏ మాయ చేసావె వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. సంజయ్ స్వరూప్.. అర్జున్ రెడ్డి, చల్ మోహనరంగ వంటి పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)చదవండి: కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా!