ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన | Gangs Of Godavari Movie OTT Release Date Announced, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Ganga Of Godavari In OTT: ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన

Jun 9 2024 10:52 AM | Updated on Jun 9 2024 12:51 PM

Gangs Of Godavari OTT Streaming Date Announced Now

టాలీవుడ్‌ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా  'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న థియేటర్స్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్‌ అభిమానులకు విజిల్స్‌ కొట్టించే సినిమా అని కూడా చెప్పవచ్చు. తాజాగా విశ్వక్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త వచ్చేసింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

విష్వక్‌ సేన్‌, అంజ‌లి, నేహాశెట్టి, నాజ‌ర్‌, పి.సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' జూన్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

గోదావ‌రి నేప‌థ్యంలో సినిమా అంటే ప‌చ్చ‌టి ప‌ల్లెసీమ‌ల్లో కనిపించే  వాతావ‌ర‌ణ‌మే గుర్తొస్తుంది. అయితే, అందుకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ఓ యువ‌కుడి ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణ‌చైత‌న్య  అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులు అంజలి పాత్రకు కాస్త ఎక్కువ మార్కులే పడుతాయి. విష్వక్‌ నటనకు ఏమాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినిమా విడుదలయిన వారంలోనే రూ. 20 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో థియేటర్‌లో రన్‌ అవుతుంది. అయితే, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా చూడొచ్చని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement