చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద అభిమానుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ శుక్రవారం కేవలం రీ రిలీజ్‌ల సందడి నెలకొంది.
ఈ ఫ్రైడే కొత్త సినిమాల హడావుడి థియేటర్ల వద్ద లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంటరీతో పాటు లింగం లాంటి డబ్బింగ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అవతార్-3, బ్లాస్ట్ లాంటి సినిమాలు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26
లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26
బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26
నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26
ఎజెంట్ కిమ్ రియాక్టివేటేడ్(కొరియన్ సిరీస్)- జూన్ 26
లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27
జియో హాట్‌స్టార్
లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26
ది బేర్ సీజన్-5(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26
అమెజాన్ ప్రైమ్
అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26
జీ5
ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26
మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26
ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26
సోనీ లివ్
ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26
లయన్స్ గేట్ ప్లే
బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26
ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26
దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26
హెచ్‌బీవో మ్యాక్స్..
అండర్‌టోన్(ఇంగ్లీష్ సినిమా)- జూన్ 26


