
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, ‘దిల్’ రాజు యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్ మెంట్స్ సంస్థ విడుదల చేయనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిటు..’ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించిన ఈ పాటని అనిరు«ధ్, అరివు పాడారు. ‘‘కూలీ’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. తాజాగా విడుదలైన ‘చికిటు..’ పాటకి మంచి స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: గిరీష్ గంగాధరన్.