ఓటీటీలోకి వచ్చేసిన 'లోకేష్ కనగరాజ్' యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా | Fight Club Movie Released In OTT, Check Streaming Platform Details Inside - Sakshi
Sakshi News home page

Fight Club Movie OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన 'లోకేష్ కనగరాజ్' యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా

Published Sat, Jan 27 2024 2:03 PM

Fight Club Movie OTT Streaming In Hotstar - Sakshi

ఇప్పుడు అంతా ఓటీటీ ట్రెండ్‌ కొనసాగుతుండటంతో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు తెలుగులోకి కూడా డబ్‌ అవుతున్నాయి. ఇప్పటికే తమిళ చిత్రం అయిన 'జో' హాట్‌స్టార్‌లో మంచి టాక్‌తో స్ట్రీమింగ్‌ అవుతుంది.తాజాగా నేటి నుంచి (జనవరి 27) మరో ఆసక్తికరమైన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్‌గా విక్రమ్, లియో చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. జీ స్క్వాడ్ ప్రొడక్షన్‌ పేరుతో ఆయన నిర్మాతగా మారాడు. 'ఫైట్‌ క్లబ్‌' పేరుతో తమిళ్‌లో ఒక చిత్రాన్ని ఆయన నిర్మించారు. అబ్బాస్ ఎ. రెహ్మత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో విజయ్ కుమార్ నటించాడు. ఉరియాది మూవీతో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్.. ఈ 'ఫైట్‌ క్లబ్‌'లో మెయిన్ రోల్‌లో కనిపించాడు.

ఈ సినిమా గతేడాది డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లతో పాటురూ. 9 కోట్లకు పైగా షేర్ క‌లెక్షన్స్‌ను అందుకుంది. ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. ఏదేమైనా నేటి నుంచి హాట్‌స్టార్‌లో 'ఫైట్‌ క్లబ్‌' స్ట్రీమింగ్‌ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది.

ఇదొక రివేంజ్‌ డ్రామా కథ
రివేంజ్ డ్రామాగా ఫైట్‌ క్లబ్‌ చిత్రం ఉంటుంది. కాలేజీలో ఉన్న‌ హీరోపై ఎటాక్ చేసేందుకు విల‌న్ గ్యాంగ్ ప్ర‌య‌త్నించే సీన్‌తో సినిమా మొద‌ల‌వుతుంది. కథల భాగంగా సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్‌ హాఫ్‌లో చాలా ప్రశ్నలు మనకు కలుగుతాయి. వాటంన్నిటికీ సెకండాఫ్‌లో డైరెక్టర్‌ రివీల్‌ చేస్తాడు. ఈ క్రమంలో ఆడియన్స్‌ను బాగా ఎంగేజ్‌ చేస్తాడు డైరెక్టర్‌. ఇందులోని సీన్స్‌ ఎక్కువగా రివేంజ్‌లాగే ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్‌కు ఎవరైనా ఫిదా అవుతారు. కథ పాతదే అయిన టేకింగ్‌ విధానం బాగుంటుందని టాక్‌ ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని తప్పక ఇష్టపడుతారని కామెంట్లు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement