Fans Built Actress Nidhhi Agerwal Statue Temple In Chennai On Valentines Day - Sakshi
Sakshi News home page

అందాల ‘నిధి’కి గుడి కట్టిన అభిమానులు

Feb 15 2021 8:35 AM | Updated on Feb 15 2021 3:26 PM

Fans Collaborated And Built A Statue Temple For Nidhhi Agerwal In Chennai - Sakshi

నిధి అగర్వాల్‌ తన అభిమానుల నుంచి విలువ కట్టలేని అందమైన బహుమానాన్ని అందుకుంది.

‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. రెండో సినిమాతోనే అక్కినేని హీరోతో ఆడిపాడిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఈస్మార్ట్ శంకర్’తో ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. తాజాగా నిధి అగర్వాల్‌ అభిమానుల నుంచి విలువ కట్టలేని అందమైన బహుమానాన్ని అందుకుంది.

తమ అభిమాన నటి నిధికి తెలుగు తమిళ అభిమానులు కలిసి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చెన్నైలో విగ్రహం చేయించి గుడి కట్టారు. అంతేగాక విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేయించారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో నిధి ఫ్యాన్స్‌ క్లబ్‌ షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎంత అభిమానం ఉంటే ఇలా విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తారని నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. మరి ఈ విషయం నిధి దాకా చేరిందో లేదో తెలీదు. ఒకవేళ తెలిస్తే ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. కాగా ఇటీవల బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కు తెలంగాణలో విగ్రహం ఏర్పాటు చేసిన విషషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో ఆయన చేసిన సేవలను కీర్తిస్తూ సోనూ అభిమానులు సిద్ధిపేట జిల్లాలోని దుబ్బతండాలో ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు.

 


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: పవన్‌ సినిమాలో నిధి అగర్వాల్
రామ్‌ అలా ప్రపోజ్‌ చేశాడు : సింగర్‌ సునీత

Advertisement
 
Advertisement
Advertisement