Surekha Vani Reacted KP Chowdhary Drug Case - Sakshi
Sakshi News home page

Drugs Case Surekhavani: వీడియో విడుదల చేసిన సురేఖావాణి

Jun 25 2023 4:16 PM | Updated on Jun 25 2023 6:08 PM

Drugs Case Surekha Vani Video - Sakshi

టాలీవుడ్ లో డ‍్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిర్మాత కేపీ చౌదరి ఈ మధ్య డ్రగ్స్ తో దొరికిపోయాడు. పోలీసు కస్టడీలో అతడి ఫోన్ పరిశీలించగా.. పలువురు నటీనటుల పేర్లు బయటపడ్డాయి. ఈ జాబితాలో నటి సురేఖావాణిపై ప్రముఖంగా ఆరోపణలు వచ్చాయి. ఈమె డ్రగ్స్ తీసుకుందనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వీటిపై ఆమెనే స్వయంగా స్పందించింది. 

ఈ డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు బయటకు రావడం నిజమా కాదా అని నిర్ధరించుకునేలోపు.. కేపీ చౌదరి బుగ్గపై ఈమె ముద్దు పెడుతున్న పాత ఫొటో ఒకటి బయటపడింది. ఆ రోజు మద్యం లేదా డ్రగ్స్ మత్తులో ఉందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ ని ఖండిస్తూ సురేఖావాణి మీడియాకు ఓ వీడియోని రిలీజ్ చేసింది.

'గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయుంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, నా పిల్లల కెరీర్, నా కుటుంబం ఆరోగ్యం.. ఇలా అన్నిరకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి' అని సురేఖావాణి ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: Drugs Case: టాలీవుడ్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. ఆ 12 మందికి నోటీసులు?)

Advertisement
 
Advertisement
Advertisement