TS Police Issued Notice to 12 Members in KP Chowdary Drugs Case - Sakshi
Sakshi News home page

Drugs Case: టాలీవుడ్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. ఆ 12 మందికి నోటీసులు?

Published Sun, Jun 25 2023 1:56 PM

Kp Chowdary Drugs Case 12 Members Notice - Sakshi

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని  కస్టడీకి తీసుకుని లోతుగా ప్రశ్నించారు. కేపీ చౌదరి ఫోన్ కాల్ లిస్టులో పలువురి సెలబ్రిటీల పేర్లున్నాయి. అందులో అషురెడ్డితో పాటూ సురేఖావాణి పేరు కూడా ఉంది. దీంతో కేపీ చౌదరి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పుడే టాలీవుడ్‌లో కొందరికి గుబులు పట్టుకుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. ఇప్పటికే డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అషూరెడ్డి తెలిపింది. 

(ఇదీ చదవండి: నేను ఏ తప్పు చేయలేదు, భయపడేది లేదు: నటి జ్యోతి)

తాజాగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న 12 మందికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్‌ రోషన్, నల్లా రతన్‌ రెడ్డి, ఠాగోర్‌ విజ్‌ అలియాస్‌ ఠాగోర్‌ ప్రసాద్‌ మోటూరి, తేజ్‌ చౌదరి అలియాస్‌ రఘు తేజ, వంటేరు శవన్‌ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్‌లకు కేపీ చౌదరి డ్రగ్స్‌ విక్రయించినట్లు  కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్‌ చేశాడంటే..)

Advertisement
 
Advertisement
 
Advertisement