ఇలాంటి టాక్‌తో రూ.100 కోట్ల కలెక్షన్.. ఎలా సాధ్యం? | Drishyam 3 Movie Collection Worldwide | Sakshi
Sakshi News home page

Drishyam 3 Collection: మోహన్ లాల్ 'దృశ్యం 3'కి అలా కలిసొచ్చింది

May 24 2026 3:03 PM | Updated on May 24 2026 3:28 PM

Drishyam 3 Movie Collection Worldwide

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నా వాటిని జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు డబ్బింగులని మాత్రం ఆదరిస్తున్నారు. అలా ఈ వీకెండ్ రిలీజైన 'దృశ్యం 3' మంచి ఆక్యుపెన్సీ నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులైన కాకముందే రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇంతకీ ఎలా సాధ్యమైంది?

(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)

మోహన్ లాల్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'దృశ్యం' ఫ్రాంచైజీ ఈయనకు మరింతలా ఫేమ్ తీసుకొచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాల్ని వెంకటేశ్‌తో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. ‍అయితే మూడో భాగాన్ని రీమేక్ చేయకుండా మలయాళ వెర్షన్‌నే డబ్బింగ్ రూపంలో ఈ గురవారం థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇందులో సాగదీత తప్పితే ఏం లేదని రివ్యూలు వచ్చాయి. కానీ ఆడియెన్స్ మాత్రం ఈసారి జార్జ్ కుట్టి అండ్ ఫ్యామిలీ ఎలాంటి ఎత్తులు వేశారా అని థియేటర్లకు వెళ్తున్నారు.

అలా మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ మోహన్ లాల్-జీతూ జోసెఫ్ 'దృశ్యం 3'కి మూడు రోజులైనా గడవక ముందు అంటే 58 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే పోస్టర్ రిలీజ్ చేసి మరీ ధ్రువీకరించారు. టాక్ బాగోలేకపోయినా ఈ రేంజ్ కలెక్షన్స్‌కి కారణం..ఫ్రాంచైజీపై ఉన్న హైప్, మోహన్ లాల్ లాంటి స్టార్ పవర్ కూడా కారణమని చెప్పొచ్చు. ఎలాంటి ప్రచారం చేయకుండా తెలుగులోనూ రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ కూడా మల్టీప్లెక్స్‌ల్లో మంచి నంబర్లే నమోదవుతుండటం విశేషం.

(ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement