రొమాంటిక్‌ ప్రేమకథగా వస్తోన్న 'దూరదర్శని'.. సుకుమార్‌ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ | Dooradarshini Movie Lyrical Song Video Out Now | Sakshi
Sakshi News home page

Dooradarshini Movie: రొమాంటిక్‌ ప్రేమకథగా వస్తోన్న 'దూరదర్శని'.. సుకుమార్‌ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్

Apr 18 2025 6:37 PM | Updated on Apr 18 2025 6:51 PM

Dooradarshini Movie  Lyrical Song Video Out Now

సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరినీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990 నేపథ్యంలో జరిగిన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పుష్ప-2 డైరెక్టర్‌ సుకుమార్‌ చేతుల మీదుగా ఓరోరి మొండివాడా’ అంటూ సాగే బ్యూటిఫుల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సింధుజ, శ్రీనివాసన్‌  ఆలపించగా.. సురేష్‌ బనిశెట్టి సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ 'ఈ సినిమా హీరో సువిక్షిత్‌ నా రూపం వచ్చేటట్లు  వరిపొలంలో ఫామింగ్‌ చేశాడు. నాకు అప్పట్నుంచి పరిచయం ఉంది. తనకి  సినిమా అంటే ప్యాషన్. సాంగ్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి' అన్నారు.

హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. 'నా అభిమాన దర్శకుడు, ఎంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్‌ చేతుల మీదుగా మా సాంగ్‌ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకొస్తాయి. ఈ లిరికల్‌ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది.1990వ నేపథ్యంలో అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో భద్రం, కృష్ణా రెడ్డి, కిట్టయ్య, చలపతి రాజు, జెమిని సురేష్‌, జి.భాస్కర్‌, భద్రమ్‌, లావణ్య రెడ్డి, తేజ చిట్టూరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement