గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ | Director Nag Ashwin Wife Priyanka Pregnancy Again | Sakshi
Sakshi News home page

Nag Ashwin: 'కల్కి' సీక్వెల్‌తో బిజీ.. మరోవైపు శుభవార్త

Jun 28 2026 2:37 PM | Updated on Jun 28 2026 2:56 PM

Director Nag Ashwin Wife Priyanka Pregnancy Again

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ శుభవార్త చెప్పేశాడు. తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన భార్య ప్రియాంక ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోని పంచుకున్నాడు. దీంతో పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: సీఎం విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)

'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. ఈ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలోనే నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంకతో ప్రేమలో పడ్డాడు. అలా పెద్దల్ని ఒప్పించి 2015లో నాగ్ అశ్విన్-ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు 2017లో కొడుకు పుట్టాడు. అయితే తన తొలి మూవీలో విజయ్ దేవరకొండ పాత్రకు పెట్టిన రిషి అనే పేరుని నాగ్ అశ్విన్ తన కొడుక్కి పెట్టాడు.

2018లో 'మహానటి' సినిమాతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ్ అశ్విన్.. తర్వాత ప్రభాస్ హీరోగా 'కల్కి 2898ఏడీ' సినిమా తీశాడు. 2024లో ఇది రిలీజై హిట్ కొట్టింది. ప్రస్తుతం దీని సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. స్వతహాగా దర్శకుడి అయినప్పటికీ జాతిరత్నాలు, రీసెంట్‌గా వచ్చిన 'సింగ్ గీతం' చిత్రాలని నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' ఇదే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement