ఇండస్ట్రీలో విషాదం.. సూపర్ హిట్‌ మూవీ డైరెక్టర్ మృతి! | Dhoom Movie Director Sanjay Gadhvi Passed Away | Sakshi
Sakshi News home page

Sanjay Gadhvi: ఇండస్ట్రీలో విషాదం.. ‘ధూమ్‌’ మూవీ డైరెక్టర్ మృతి!

Nov 19 2023 2:13 PM | Updated on Nov 19 2023 2:42 PM

Dhoom Movie Director Sanjay Gadhvi Passed Away - Sakshi

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌ గాధ్వి (56) కన్నుమూశారు. ముంబయిలోని నివాసంలో ఉదయం సంజయ్‌ తుదిశ్వాస విడిచారని ఆయన పెద్దకుమార్తె సంజినా తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.

2000లో విడుదలైన తేరే లియే చిత్రంతో సంజయ్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. 2004లో విడుదలైన ధూమ్‌ సినిమాతో ఆయన తొలి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఏడాదే ధూమ్‌ -2తో అలరించారు. 2020లో విడుదలైన ఆపరేషన్ పరిందే ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన చివరి చిత్రంగా నిలిచింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement