ప్రెగ్నెన్సీ రూమర్స్‌.. స్పందించిన బుల్లితెర నటి | Devoleena Bhattacharjee React On Pregnancy Rumours, It is My Personal Space | Sakshi
Sakshi News home page

చాలాకాలంగా అడుగుతున్నారు.. ప్రెగ్నెన్సీ గురించి నటి ఏమందంటే?

Jun 29 2024 7:54 PM | Updated on Jun 29 2024 8:15 PM

Devoleena Bhattacharjee React On Pregnancy Rumours, It is My Personal Space

బుల్లితెర నటి దేవలీన భట్టాచార్జి త్వరలో తల్లి కాబోతుందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. తాజాగా ఈ రూమర్స్‌పై నటి స్పందించింది. 'నేను ప్రెగ్నెంటా? అని అడుగుతూ చాలాకాలంగా మెసేజ్‌లు వస్తున్నాయి. అది నాకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్తాను. అయినా ఇలాంటిదేదైనా ఉంటే నా అంతట నేనే చెప్తా. అప్పటివరకు నన్ను వదిలిపెట్టండి.

నేను ప్రెగ్నెంటో? కాదో? తెలుసుకుని మీరేం చేస్తారు? నాకేదైనా మంచి విషయాలు, సూచనలు చెప్తారా? లేదా ట్రోల్‌ చేస్తారా? ఇప్పుడవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. ఇది నా జీవితం. నాకు నచ్చినట్లు బతకనివ్వండి. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా దేవలీనా.. షానవాజ్‌ షైఖ్‌ను 2022 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది.

చదవండి: కల్కిపై తారల రివ్యూ.. నాగ్‌, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే?

Advertisement
 
Advertisement
Advertisement