CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..! | CM Vijay and Sankgeetha divorce case latest Update | Sakshi
Sakshi News home page

CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!

Jun 15 2026 1:10 PM | Updated on Jun 15 2026 3:18 PM

CM Vijay and Sankgeetha divorce case latest Update

విజయ్ సీఎం కాకముందే తన భార్య సంగీతతో విడాకుల వివాదం మొదలైంది. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం డివోర్స్ పిటిషన్ దాఖలైంది. తమిళనాడు ఎన్నికల ముందే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును చెంగల్పట్టు మహిళా కోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం విజయ్, సంగీత విడాకులపై సోమవారం విచారణకు వచ్చింది.

ఈ కేసును విచారించిన  చెంగల్పట్టు మహిళా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును మొదట ఏప్రిల్ 20న విచారణ చేపట్టగా.. అప్పట్లో విజయ్, సంగీత హాజరు కాలేదు. దీంతో జూన్ 15న హాజరు కావాలని చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో మరోసారి వాయిదా వేసింది.

కాగా.. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో విజయ్ మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement