విడుదలకు సిద్ధమైన 'సీఎం పెళ్లాం' సినిమా | Cm Pellam Movie Release Details | Sakshi
Sakshi News home page

CM Pellam: విడుదలకు సిద్ధమైన 'సీఎం పెళ్లాం' సినిమా

May 6 2025 8:42 PM | Updated on May 6 2025 8:48 PM

Cm Pellam Movie Release Details

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన సినిమా 'సీఎం పెళ్లాం'. బొల్లా రామకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని గడ్డం రమణారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చిత్ర విశేషాలు పంచుకున్నారు. 

(ఇదీ చదవండి: ఎ‍ట్టకేలకు '100' కొట్టేసిన సూర్య)

ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. ఎమ్మెల్యే కాస్త బిజీగా ఉండి బయట తిరుగుతున్న సమయంలో ఇంటికి పెద్ద సంఖ్యలో తమ సమస్యల పరిష్కారానికి వచ్చిన వ్యక్తులను ఎమ్మెల్యే పెళ్లాం ఒక రెండు లేదంటే మూడు గంటల పాటు కలిస్తే చాలా మార్పులొస్తాయని నమ్మాను. ఏదో చేయాల్సిన అవసరం లేదు కానీ కలిస్తే చాలు మార్పొస్తుందని ఈ సినిమాలో చూపించా అని దర్శకుడు రమణారెడ్డి చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత)

Advertisement
 
Advertisement
Advertisement