CM Pellam Movie
-
'సీఎం పెళ్లాం' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
విడుదలకు సిద్ధమైన 'సీఎం పెళ్లాం' సినిమా
ఇంద్రజ, అజయ్ జంటగా నటించిన సినిమా 'సీఎం పెళ్లాం'. బొల్లా రామకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని గడ్డం రమణారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చిత్ర విశేషాలు పంచుకున్నారు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు '100' కొట్టేసిన సూర్య)ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. ఎమ్మెల్యే కాస్త బిజీగా ఉండి బయట తిరుగుతున్న సమయంలో ఇంటికి పెద్ద సంఖ్యలో తమ సమస్యల పరిష్కారానికి వచ్చిన వ్యక్తులను ఎమ్మెల్యే పెళ్లాం ఒక రెండు లేదంటే మూడు గంటల పాటు కలిస్తే చాలా మార్పులొస్తాయని నమ్మాను. ఏదో చేయాల్సిన అవసరం లేదు కానీ కలిస్తే చాలు మార్పొస్తుందని ఈ సినిమాలో చూపించా అని దర్శకుడు రమణారెడ్డి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత) -
రాజకీయం... సందేశం
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మీ రియల్ లైఫ్‌లో చూసినవి, విన్నవి, జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే చిత్రం ఇది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నేను సీఎంగా నటిస్తే, నా భార్య పాత్రలో ఇంద్రజ నటించారు. ఈ ప్రమోషనల్ సాంగ్ చూసి ఎమోషనల్ అయ్యాను’’ అని తెలిపారు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ. ‘‘మన నగరం ఎలా ఉంది? అనేది ఈ పాటలో చూపించాను. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెబుతున్నాను. సామాజిక నేపథ్యం ఉన్న చిత్రం ‘సీఎం పెళ్లాం’’ అని అన్నారు గడ్డం రమణారెడ్డి. -
‘సీఎం పెళ్లాం’.. మంచి సందేశం ఇచ్చే చిత్రం
జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం వెంకట రమణారెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటించాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో సీఎం భార్యగా నటించాను. సందేశాన్నిచ్చే చిత్రం ఇది’’ అని తెలిపారు ఇంద్రజ. (చదవండి: వాడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా లేదు.. ఫైర్ అయిన యష్మి)‘సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది’ అని అన్నారు నటుడు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సందేశాత్మక చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. ఓ సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపించే ప్రయత్నం చేశాం’’ అని వెల్లడించారు గడ్డం వెంకట రమణారెడ్డి. ‘‘ఈ చిత్రంలో మహిళా సాధికారకత అంశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ.