
ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar), సింగర్ సైంధవికి విడాకులు మంజూరయ్యాయి. ఈమేరకు చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. జీవీ ప్రకాశ్ తన స్కూల్ ఫ్రెండ్ సైంధవిని 2013లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2020వ సంవత్సరంలో కూతురు అన్వి జన్మించింది. 11 ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ప్రకాశ్ దంపతులు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించారు.
విడాకులు మంజూరు
ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగారు. మలేషియాలో జరిగిన జీవీ ప్రకాశ్ సంగీత కచేరీలో సైంధవి పాట పాడారు. ఓపక్క స్నేహాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు విడాకుల కోసం వీరిద్దరూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కూతురు అన్విని సైంధవి వద్దే ఉంచేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని జీవీ ప్రకాశ్ కోర్టుకు తెలిపాడు. దీంతో న్యాయస్థానం మంగళవారం నాడు ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.