ప్రముఖ నటుడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు | Bullets Detained In Actor Karunas Bag | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు

Jun 3 2024 8:54 AM | Updated on Jun 3 2024 9:18 AM

Bullets Detained In Actor Karunas Bag

నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు లభించడంతో తమిళనాట ఈ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కరుణాస్‌ బ్యాగ్‌లను అధికారులు సోదాలు చేస్తుండగా ఒక్కసారిగా అలారం మోగడంతో వెంటనే వారు అలర్ట్‌ అయ్యారు.

నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న  భద్రతా అధికారులు ఆయన ప్రయాణాన్ని రద్దు చేసి విచారణ జరిపారు. బ్యాగులోకి బుల్లెట్లు ఎలా వచ్చాయని వారు ప్రశ్నించారు. దీంతో తన వద్ద లైసెన్స్ తుపాకీ ఉందని.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించారు. 

అయితే, అత్యవవసరంగా ప్రయాణం చేయాల్సి రావడంతో బ్యాగులో ఉన్న బుల్లెట్ల బాక్సును గమనించలేదని కరుణాస్‌ తెలిపారు. ఆయన మాటలను రికార్డ్‌ చేసుకున్న అధికారులు మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement