breaking news
karunas
-
‘‘సూపర్ హిట్ సినిమాలో హీరో పాత్రను వదులుకున్న నటుడు’’
నటుడు కరుణాస్ తన సినీ ప్రయాణంలో ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయిన ఓ నిర్ణయం గురించి వెల్లడించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అసురన్’లో తొలుత హీరో పాత్ర కోసం తనను సంప్రదించారని, అయితే తాను ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పారు. కథను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలంటే బలమైన హీరో ఇమేజ్ ఉన్న నటుడు అవసరమని తాను భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కరుణాస్ తెలిపారు. ‘అసురన్’ సినిమా తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా 2021లో ‘‘నారప్ప’’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.బిహైండ్వుడ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అసురన్’ సినిమా గురించి కరుణాస్ మాట్లాడుతూ.. “నా కొడుకుతో కలిసి ‘అసురన్’లో నటించాల్సి ఉంది. వెట్రిమారన్ నాతో ఈ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కథ చదివి వెంటనే ఆయనతో ‘సర్, ఇందులో హీరో నటిస్తేనే ఇది పనిచేస్తుంది. నేను నటించను’ అని చెప్పాను” అన్నారు.తనతోనే సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి వెట్రిమారన్ సిద్ధంగా ఉన్నారని, అయితే మరింత గుర్తింపు ఉన్న హీరోను ఎంపిక చేసుకోవడం సినిమాకు ప్రయోజనకరంగా ఉంటుందని తాను భావించానని ఆయన గుర్తుచేసుకున్నారు. కరుణాస్ తీసుకున్న నిర్ణయంతో చివరకు ధనుష్ ఆ పాత్రను పోషించే అవకాశం వచ్చింది.ఎందుకు అలా కోరారంటే..దర్శకుడితో జరిగిన సంభాషణను కరుణాస్ మరింతగా గుర్తుచేసుకున్నారు. “కథ అద్భుతంగా ఉందని, హీరో ఇమేజ్ ఉన్న వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తే సినిమా వాణిజ్యపరంగా మరింత బాగా పనిచేస్తుందని చెప్పాను. సినిమా స్వభావాన్ని బట్టి నిర్ణయం తీసుకునే వ్యక్తిని నేను. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తుంటే, అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు?” అని అన్నారు. కరుణాస్‌తో సినిమాను ఎలా చేయాలో తనకు తెలుసని దర్శకుడు హామీ ఇచ్చారని, అయినా తాను తీసుకున్న నిర్ణయంలో మార్పు చేయలేదని ఆయన తెలిపారు.జాతీయ పురస్కారం అందుకున్న ‘అసురన్’‘అసురన్’ 2019లో విడుదలైంది. ధనుష్, మంజు వారియర్, కెన్ కరుణాస్, పశుపతి నటించారు. సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ అందించారు. రచయిత పూమణి రాసిన ‘వెక్కై’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కథ, నటీనటుల ప్రదర్శనలకు సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. అనంతరం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. -
పెట్టింది చీమంతా.. వచ్చింది కొండంతా.. ఆ సినిమాలు ఇవే!
వందల కోట్లు ఖర్చు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలు కోలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కి అంచనాలను తారుమారు చేసిన తమిళ సినిమాలూ ఉన్నాయి. స్టార్డమ్తో పనిలేకుండా కథలో దమ్ముండి బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన కొన్ని తమిళ సినిమాల కోసం ఓ లుక్కేద్దాం..!విత్ లవ్:‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘విత్ లవ్’. ఇందులో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్, మాగేశ్ రాజ్ కలిసి నిర్మించారు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఏకంగా రూ.39 కోట్ల వసూళ్లను రాబట్టింది.తాయ్ కిళవి:ఒకప్పటి హీరోయిన్ రాధిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘తాయ్ కిళవి’. రాధికను లీడ్ రోల్లో పెట్టి తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.82 కోట్ల మేర వసూళ్లను సాధించింది.యూత్:తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘యూత్’. ఈ సినిమాకు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కురప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.81 కోట్ల వసూళ్లు రాబట్టింది.బ్లాస్ట్:అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్’. తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదలైంది. సుభాష్ కె.రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. లీడ్ రోల్స్‌లో నటించిన వారు పెద్ద స్టార్లు కాకపోయినా.. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టింది. -
ప్రముఖ నటుడి బ్యాగ్‌లో 40 బుల్లెట్లు
నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు లభించడంతో తమిళనాట ఈ వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కరుణాస్ బ్యాగ్‌లను అధికారులు సోదాలు చేస్తుండగా ఒక్కసారిగా అలారం మోగడంతో వెంటనే వారు అలర్ట్ అయ్యారు.నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న భద్రతా అధికారులు ఆయన ప్రయాణాన్ని రద్దు చేసి విచారణ జరిపారు. బ్యాగులోకి బుల్లెట్లు ఎలా వచ్చాయని వారు ప్రశ్నించారు. దీంతో తన వద్ద లైసెన్స్ తుపాకీ ఉందని.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించారు. అయితే, అత్యవవసరంగా ప్రయాణం చేయాల్సి రావడంతో బ్యాగులో ఉన్న బుల్లెట్ల బాక్సును గమనించలేదని కరుణాస్ తెలిపారు. ఆయన మాటలను రికార్డ్ చేసుకున్న అధికారులు మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు. -
ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
చెన్నై: నటుడు కరుణాస్ మళ్లీ కథానాయకుడిగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈయన నటిస్తున్న చిత్రానికి 'ఆధార్' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ రిత్విక కథానాయకిగా నటిస్తోంది. పీఎస్ రామ్‌నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నిల క్రియేషన్స్ పతాకంపై అళగమ్మై మగన్ శశికుమార్ ఆర్యూఎం చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో షూటింగ్ కార్యక్రమం ప్రారంభమైన ఈ చిత్రానికి మనోజ్ నారాయణన్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఆ పోస్టర్లతో నా భార్యకు గుండెపోటు
- నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ - పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చెన్నై: ఉద్దేశపూర్వకంగా తనను, కుటుంబాన్ని దారుణంగా కించపరుస్తోన్నవారిని శిక్షించాలని కోరుతూ సినీ నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ చెన్నై పోలీస్‌కమీషనర్‌కు ఫిర్యాదుచేశారు. అన్నా డీఎంకే తరఫున తిరువాడాళై నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరుణాస్.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో శశికళకు మద్దతుగా నలిచిన విషయం తెలిసిందే. అయితే కరుణాస్.. శశికళకు మద్తతు పలకడంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల 22న కరుణాస్ పుట్టినరోజు సందర్భంగా విమర్శలజడి శృతిమించింది. కరుణాస్ ఫొటోకు ఆయన భార్య గ్రేస్ కన్నీటి అంజలి ఘటిస్తున్నట్లు కొందరు పోస్టర్లు రూపొందించారు. అంతటితో ఆగకుండా, ఆ పోస్టర్లను ముద్రించి గోడలపై అంటించారు. ఈ పరిణామాలతో కలత చెందిన కరుణాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా కన్నీటి అంజిలి ఘటిస్తూ ముద్రించిన పోస్టర్లు చూసి తన భార్య తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. భావ స్వాతంత్ర్యం పేరుతో తనను కించపరచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను పోటీ చేసి గెలిచిన తిరువాడాళై నియోజక వర్గంలో 2,86,644 ఓటర్లు ఉన్నారని..అందులో నాకు వచ్చిన ఓట్లు 76 వేల 786 అని తెలిపారు. తన గెలుపును వ్యతిరేకించిన వారి సంఖ్య లక్షా 15 వేలు అని, ఓటు హక్కును వినియోగించుకోని వారి సంఖ్య 80 వేలు ఉందన్నారు. మొత్తం మీద తనకు, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రెండు లక్షల మంది ఉన్నారని అన్నారు. తనను కించపరచే విధంగా విమర్శలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. శుక్రవారం తన నియోజక వర్గం అయిన తిరువాడాళైకు కార్యకర్తలతో కలిసి వెళ్లిన కరుణాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీపా పేరవైకి చెందిన కొందరు కరుణాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతోపో లీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పి పంపారు. -
నడిగర్ సంఘం పదవికి రాజీనామా చేస్తా..
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్నట్లు నటుడు, శాసన సభ్యుడు కరుణాస్ వెల్లడించారు. హాస్యనటుడిగా, కథానాయకడిగా ప్రాచుర్యం పొందిన ఈయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపికైన విషయం తెలిసిందే. అదే విధంగా నడిగర్‌సంఘం ఎన్నికల్లోనూ ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడా పదవి నుంచి వైదొలగనున్నట్లు కరుణాస్ వెల్లడించారు. దీని గురించి ఆయన తె లుపుతూ యుక్త వయసు లోనే తాను నటుడవ్వాలని కలలు కనే వాడినన్నారు. అది నెరవేరిందని,అయితే రాజకీయవాదినవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఆశ పడడం మానవ సహజం అనీ,అయితే అత్యాశ కూడదని అన్నారు.45 చిత్రాలలో నటించానని ముఖ్యమంత్రి కావాలనుకోవడం దురాశే అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.రాజకీయాలు అంత సులభం కాదన్నారు. నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో పలు గ్రామాలు తిరిగి నటీనటుల ఆర్థిక పరిస్థితిని తెలుకున్నామన్నారు. అదే విధంగా శాసన సభ ఎన్నికల్లో వేలాది గ్రామాలు తిరిగి ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నానన్నారు. నడిగర్‌సంఘం సభ్యుల సమస్యలను చాలా వరకూ పరిష్కరించానని, సంఘం భవన నిర్మాణ నిధికి స్టార్స్ క్రికెట్‌ను నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఇక ఒక శాసనసభ సభ్యుడిగాప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. ఒక నటుడిగా నడిగర్‌సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి త్వరలో వైదొగలనున్నట్లు కరుణాస్ వెల్లడించారు. రాజకీయాలపైనే పూర్తి దృష్టి ఉంచుతానని చెప్పారు. -
కరుణాస్‌కు హైకోర్టులో ఊరట
తమిళసినిమా: నటుడు కరుణాస్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. హాస్యనటుడిగా, కథానాయకుడిగా ప్రాచుర్యం పొందిన కరుణాస్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆయన తిరువానటనై నియోజక వర్గం అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయన అభ్యర్థిత్వం చెల్లదంటూ రామనాథపురం జిల్లాకు చెందిన రాజీవ్‌గాంధీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను రామనాథపురం జిల్లా తిరువా టనై నియోజక వర్గం నుంచి నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు. తనతో పాటు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. కరుణాస్ ఇదే నియోజక వర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. అయితే ఆయన అన్నాడీఎంకే సభ్యుడు కాదని, ముక్కులత్తూర్ పడై సంఘానికి నిర్వాహకుడుగా పేర్కొన్నారు. నామినేషన్ దరఖాస్తులో నిబంధనలకు విరుద్ధంగాఅన్నాడీఎంకే అభ్యర్థిగా పేర్కొన్నారని ఆరోపించారు. అన్నాడీఎంకేను గుర్తింపు పొందిన పార్టీ అని దాని గుర్తును అందులోని సభ్యులే ఉపయోగించుకోవాలన్నారు. ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా ఇతరులు వాడుకోరాదని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కరుణాస్ వేసిన నామినేషన్ చెల్లదని, దానిని నిరాకరించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎన్.కృపాకరన్, మురళీధర న్ సమక్షంలో గురువారం విచారణకు వచ్చింది. వారి వాదనలు విన్న న్యాయమూర్తులు ఎన్నికల అధికారులు వెల్లడించిన అభ్యర్థుల పట్టికలో ఉన్న పేరును తొలగించాలని కోరే హక్కు ఎవరికీ ఉండదని, ప్రతి వాదికి ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చని కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
లోడుక్కు పాండిగా కరుణాస్
హాస్యనటుడు కరుణాస్ మరోసారి కథానాయకుడిగా తెరపైకి రానున్నారు. హాస్యపాత్రలో తనకంటూ ఒక బాణీని ఏర్పరచుకుని ప్రాచుర్యం పొందిన కరుణాస్ అంబా సముద్రపు అంబాని చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత కథానాయకుడిగా పలు చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాలు సాధించకపోవడంతో హాస్యపాత్రపై దృష్టి సారించిన ఆయన తాజాగా మరోసారి లోడుక్కు పాండిగా హీరోగా రానున్నారు. విశేషం ఏమిటంటే కరుణాస్ నటుడిగా పరిచయమైన నందా చిత్రంలో ఆయన పాత్ర పేరు లోడుక్కు పాండి. ఈ పాత్ర కరుణాస్‌కు చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడా పేరునే సినిమా టైటిల్‌గా పెట్టుకుని తెరపైకి రానున్నారు. ఎ.విక్టరీ క్రియేషన్స్, జి.పిక్చర్స్ అధినేతలు భరద్వేష్, బి.శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీస్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా సక్సేనా కథానాయకిగా పరిచయమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇతరులను మోసం చేయడం మరొకరి అవకాశాన్ని అక్రమంగా పొందటంలాంటి జీవితం కంటే సక్రమ మార్గంలో జీవిస్తే విజయాన్ని పొందవచ్చని మోసపూరితంగా చేజిక్కించుకునే విజయం శాశ్వతం కాదని చెప్పే ఇతివృత్తంతో రూపొంది స్తున్న చిత్రం లోడుక్కు పాండి అని వివరించారు. ఈ చక్కని సందేశాన్ని వినోదభరితంగా చెప్పనున్నట్లు చిత్రం కోసం ప్రత్యేకంగా రూ.16 లక్షల వ్యయంతో భారీ సెట్‌ను రూపొందించి చిత్రీకరించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.


