Bollywood TV Actress Vahbiz Dorabjee Responds on Being Body Shamed - Sakshi
Sakshi News home page

Bollywood Tv Actress: అమ్మను, నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. కానీ: బుల్లితెర నటి

Aug 15 2023 1:43 PM | Updated on Aug 15 2023 3:03 PM

Bollywood Tv Actress Vahbiz Dorabjee Responds on being body shamed - Sakshi

సినీ ఇండస్ట్రీతో పాటు బాడీ షేమింగ్‌ సంఘటనలు మనం చూసే ఉంటాం. నటీమణులు బాడీ షేమింగ్‌కు గురి కావడం కాస్తా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్స్‌పైనే ఎక్కువగా ఇలాంటి ట్రోల్స్ వస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి వాబిజ్ దోరాబ్జీ తనకు ఎదురైన సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన తల్లిని ఉద్దేశించి కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది చూసిన తన తల్లి ఏడవడం.. తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆమె గుర్తుచేసుకున్నారు.

(ఇది చదవండి: టాయిలెట్స్ శుభ్రం చేసేవాడిని.. సల్మాన్ కామెంట్స్ వైరల్!)

బాలీవుడ్ నటి వాబిజ్ దోరాబ్జీ ఇన్‌స్టాలో రాస్తూ..'ఈ అంశం  చాలా సున్నితమైంది. ఎందుకంటే ఇది చాలా వ్యక్తిగతం కూడా. మా అమ్మ ఒకప్పుడు మిస్ పూణేగా నిలిచింది. ఆమె చాలా అందంగా ఉండేది. కానీ నాకు, సోదరుడికి జన్మనిచ్చిన తర్వాత అమ్మ బరువు పెరిగింది. ఆ తర్వాత చాలా మంది మా అమ్మను కామెంట్ చేయడం చూశా. ఆమె ఏడవడాన్ని దగ్గరి నుంచి చూశా. అయినప్పటికీ ఈ విషయాలు బయటకు చెప్పలేకపోయింది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే నాకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో బరువు పెరిగానని వెల్లడించింది.

వాబిజ్ తనపై ట్రోల్స్‌ గురించి రాస్తూ..' నా కెరీర్ ప్రారంభించినప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం బరువు పెరిగా. ఆ తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నా. ఆ దశలో నాకు చాలా కష్టమనిపించింది. నాపై నాకే నమ్మకం తగ్గిపోయింది. నేను దాని గురించే ఆలోచిస్తూ విలవిల్లాడిపోయా. నా గురించి నేను తెలుసుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. అంత ఈజీగా బరువు తగ్గలేననే వాస్తవం నుంచి బయటికొచ్చా. చివరికి నా శరీరం పట్ల నా అవగాహన కూడా మారింది. నన్ను నేను గౌరవించడం ప్రారంభించా. అప్పుడే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించడం ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే నాపై ట్రోల్స్ రావడం తగ్గింది.' అని పేర్కొంది. ఇది చూసిన నాలాగే చాలా మంది మహిళలు తమ అనుభవాల గురించి తనకు ఎలా మెసేజ్ చేస్తారని తెలిపింది. 

అంతే కాదు.. ఇది కేవలం నటీనటులకు సంబంధించిన సమస్య కాదని వాబిజ్ తెలిపింది.  ఏ స్త్రీ అయినా ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ గురించి రాసినప్పుడు.. చాలా మంది మహిళలు ఇలాంటి సంఘటనలు ఎలా ఎదుర్కొనేందుకు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. వారిలో కొందరికైనా తమ కోసం తాము నిలబడే నమ్మకాన్ని అందించగలిగితే నాకు సంతోషం అని తెలిపింది. 

(ఇది చదవండి: ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్‌ ఆది.. పేరు విహారిక!)

కాగా.. వహిజ్ దొరాబ్జీ..  ప్యార్ కీ యే ఏక్ కహానీతో సీరియల్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సావిత్రి, సరస్వతీచంద్ర సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. ప్యార్ కీ యే ఏక్ కహానీకి ఉత్తమ సహాయ పాత్రకు అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత బహు హమారీ రజనీ కాంత్‌లో సీరియల్‌లో నటించింది. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన దొరాబ్జీ 2013లో ప్యార్ కీ యే ఏక్ కహానీ సహనటుడు వివియన్ ద్సేనాను వివాహం చేసుకున్నారు. వారు 2017లో విడాకులు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement