సెట్‌లో అసభ్య ప్రవర్తన.. చెంప చెల్లుమనిపించిన బాహుబలి నటి! | Sakshi
Sakshi News home page

Nora Fatehi: సహనటుడి అసభ్య ప్రవర్తన.. సెట్‌లోనే చెంప పగలగొట్టా!

Published Thu, Feb 15 2024 5:01 PM

Bollywood Actress Nora Fatehi Pulled By Hair By Co Star In Bangladesh - Sakshi

2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాదిలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.  అతి స్వల్ప కాలంలోనే  ఇండస్ట్రీలో టాప్‌  పొజిషన్‌కు చేరింది.   అంతే కాకుండా కిక్- 2, షేర్, లోఫర్, ఊపిరి లాంటి చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌తో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది.  డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​ కూడా తన సత్తా చాటింది.

ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్‌తో  మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీస్‌లో యాక్టింగ్‌ ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్‌ మీడియాలోయాక్టివ్‌గా ఉంటే నోరాకు ఇన్‌స్టాలో 46.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలతో పాటు టీవీ రియాల్టీ డాన్స్  షోలు, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది. కెరీర్ ఆరంభంలో చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్న నోరా.. అందరి నోళ్లు మూయించేలా ఉన్నతస్థాయికి ఎదిగింది. 

సహనటుడి అసభ్య ప్రవర్తన

తాజాగా తనకు ఎదురైన ఓ చేదు సంఘటనను వివరించింది. ఇండస్ట్రీలో మొదటి నుంచి ఇబ్బందులు పడిన నోరాకు.. ఓ షూటింగ్‌ సెట్‌లో జరిగిన అవమానంపై తొలిసారి నోరు విప్పింది. గతంలో ది కపిల్ శర్మ షోకు హాజరైన భామ ఈ విషయాన్ని వెల్లడించింది. 'రోర్: టైగర్ ఆఫ్ ది సుందర్‌బన్స్' షూటింగ్ సమయంలో సహనటుడు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. 

బంగ్లాదేశ్‌లో రోర్ మూవీ షూటింగ్‌లో ఈ సంఘటన జరిగిందని నోరా పేర్కొంది. మొదట అతను నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడే లాగి చెంప దెబ్బ కొట్టానని తెలిపింది. కానీ ఆ గొడవ అంతటితో ఆగిపోలేదని.. అతను తిరిగి నా జుట్టును పట్టుకుని లాగాడని వివరించింది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందని వెల్లడించింది. దీంతో డైరెక్టర్‌ జోక్యం చేసుకుని మా ఇద్దరికి సర్దిచెప్పి విడదీయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంది. ఆ గొడవ జరిగిన సమయంలో తాను చాలా బాధపడినట్లు నోరా ఫతేహీ తెలిపింది.

కాగా.. ప్రస్తుతం నోరా క్రాక్ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న వెండితెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో విద్యుత్ జమ్‌వాల్, అర్జున్ రాంపాల్, అమీ జాక్సన్  కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇండియాలోనే మొట్టమొదటి 'ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్'గా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌ నటిస్తోన్న హౌస్‌ఫుల్-5లో నటించనుంది. 


 

Advertisement
Advertisement