బిగ్‌ బాస్‌ సెంటిమెంట్‌ ప్లాన్.. ఆ కంటెస్టెంట్‌కు శాపమైం‍దా? | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్ బాస్ ఎమోషనల్ టచ్.. ఆ కంటెస్టెంట్‌పైనే బిగ్ ఎఫెక్ట్!

Published Thu, Nov 9 2023 7:52 PM

Bigg Boss Telugu Season 7 Who Eliminated In Tenth Week - Sakshi

బిగ్‌ బాస్‌ సీజన్-7 తొమ్మిది వారాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది.  ఇప్పటి వరకు హాట్‌ హాట్‌గా  సాగిన హౌస్‌.. ఈ వారం ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్ బాస్. పదో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే..  రెండో రోజు నుంచే కంటెస్టెంట్లకు సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. తొలిరోజే శివాజీ కుమారుడు, అర్జున్ భార్య, అశ్విని మదర్‌ను పంపి ఎమోషనల్‌ టచ్ ఇచ్చారు. ఆ తర్వాత రెండో రోజు గౌతమ్ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ కుమార్, భోలే  భార్యను హౌస్‌లో పంపి కంటెస్టెంట్స్‌ను ఏడిపించేశారు. 

(ఇది చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?)

అయితే మూడో రోజు కూడా హౌస్‌లో ఎమోషనల్ సీన్స్ మరింత పీక్స్‌కు చేరాయి. మూడో రోజు అమర్ భార్య, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ వచ్చి కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ను సైతం కంటతడి పెట్టించారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, తన బ్రదర్‌ ఫుల్‌ ఎమోషనల్ అయ్యారు. అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. మొత్తానికి ఈ వారంలో టాస్కులు, గేమ్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ వీక్‌గా మార్చేశారు బిగ్ బాస్. ఇప్పటివరకు మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. హౌస్‌లో ఉన్న రైతుబిడ్డ, రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. వీరిద్దరికి సంబంధించి శుక్రవారం సర్‌ప్రైజ్‌ ఇచ్చే అవకాశముంది.  

అయితే ఫ్యామిలీ ఎమోషన్ పక్కన పెడితే.. అందరి దృష్టి ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనే దానిపైనే ఉంది. గతవారంలో చివరికీ దాకా వచ్చి రతికా రోజ్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్స్‌లో శివాజీ, యావర్, గౌతమ్, రతికా, భోలె మాత్రమే ఉన్నారు. ఇక ఓటింగ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఫ‍్యామిలీ మెంబర్స్‌ ఎంట్రీతో  శివాజీ, యావర్, గౌతమ్, భోలెకు గ్రాఫ్ పెరగడంతో పాటు ఓటింగ్‌ శాతం మెరుగయ్యే అవకాశముంది. కానీ గతవారమే తృటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న రతికా కుటుంబ సభ్యులు ఇంకా హౌస్‌లోకి రాలేదు. దీని ప్రభావం రతికా ఎలిమినేషన్‌పై పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ శుక్రవారం రతికా కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చినా అంతగా వర్కవుట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ సమయం రేపటితోనే ముగియనుంది. పల్లవి ప్రశాంత్‌ నామినేషన్స్‌లో లేడు కాబట్టి.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ ఎప్పుడొచ్చినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దీంతో ఈ ఫ్యామిలీ సెంటిమెంట్‌ వీక్ రతికాపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఆమె పేరే ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ‍్యామిలీ సెంటిమెంట్‌తో కంటెస్టెంట్స్‌ను ఏడిపించిన బిగ్ బాస్.. ఎవరినీ బయటికి పంపిస్తాడో వేచి చూద్దాం. 

(ఇది చదవండి: తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్‌ యావర్‌ బ్రదర్స్‌..)

Advertisement
 
Advertisement
 
Advertisement