తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్‌ యావర్‌ బ్రదర్స్‌.. | Bigg Boss Telugu 7: Shobha Shetty, Prince Yawar Family Surprises | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ప్రిన్స్‌కు మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన శోభా తల్లి.. అమ్మ ప్రేమ తెలీదంటూ ఏడ్చిన యావర్‌ అన్నయ్య

Published Thu, Nov 9 2023 7:12 PM | Last Updated on Thu, Nov 9 2023 7:34 PM

Bigg Boss Telugu 7: Shobha Shetty, Prince Yawar Family Surprises - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌.. ఇప్పుడు రోలర్‌ కోస్టర్‌ రైడ్‌గా మారింది. ఎప్పడూ కోపతాపాలు మాత్రమే చూపించే కంటెస్టెంట్లు అందరూ ఈ వారం మాత్రం ఎమోషనల్‌ అయిపోయారు. వారాల తరబడి ఇంటికి దూరంగా ఉన్న హౌస్‌మేట్స్‌ కుటుంబ సభ్యులను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటివరకు శివాజీ, అర్జున్‌, గౌతమ్‌, అశ్విని, భోలె, ప్రియాంకల ఫ్యామిలీ మెంబర్స్‌ వచ్చారు. నేటి ఎపిసోడ్‌లో అమర్‌దీప్‌, శోభా శెట్టి, ప్రిన్స్‌ యావర్‌ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రానున్నారు.

గిఫ్ట్‌ చూసి ఎమోషనల్‌
తల్లిని చూడగానే శోభ కేకలు పెడుతూ ఏడ్చేసింది. తర్వాత యావర్‌కు ఓ అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చింది. అందులో ప్రిన్స్‌ తల్లి ఫోటో ఫ్రేమ్‌ ఉంది. అది చూసి యావర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లి కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదాలు తీసుకుంది శోభ. మరో ప్రోమోలో ఇంటిసభ్యులను కాసేపు ఆడుకున్నాడు బిగ్‌బాస్‌. ఇంటి గేటు తెరుస్తూ.. మూస్తూ దాగుడుమూతలు ఆడాడు. ఇంతలో యావూ.. యావూ.. మేరా బచ్చా అని అన్న సులేమాన్‌ గొంతు వినబడటంతో చిన్నపిల్లాడిలా గెంతులేశాడు ప్రిన్స్‌.

కన్నీళ్లు పెట్టిస్తున్న అన్నదమ్ముల బంధం
అన్నను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. ఇక గౌతమ్‌ తల్లి తన తమ్ముడిపై అంత ప్రేమ చూపించినందుకు డాక్టర్‌ బాబుకు కృతజ్ఞతలు చెప్పాడు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదంటూ అతడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కప్పుతోనే రావాలంటూ ప్రిన్స్‌ దగ్గర మాట తీసుకుని వీడ్కోలు పలికాడు. ఈ ప్రోమో చూసిన అభిమానులు యావర్‌ను చూస్తే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయంటున్నారు.

చదవండి: ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది.. రతికతో బ్రేకప్‌పై రాహుల్‌ రియాక్షన్‌ ఇదీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement