అటెన్షన్‌ సీకర్‌ అంటూ పృథ్వీని కొట్టిన యష్మి, నిఖిల్‌ సేఫ్‌ ప్లే! | Bigg Boss Telugu 8 Day 28 Promo 1: Meeke Ankitam Challenge For Housemates In BB House, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: హౌస్‌లో తనే పెద్ద లౌడ్‌స్పీకర్‌.. నిఖిల్‌ సేఫ్‌ ప్లేయర్‌ అన్న నాగ్‌

Sep 29 2024 4:04 PM | Updated on Sep 29 2024 5:45 PM

Bigg Boss Telugu 8 Promo: Meeke Ankitam Challenge in BB House

బూతులు మాట్లాడుతూ అతిగా ఆవేశపడే పృథ్వీ తన తీరు మార్చేసుకుని ఈ వారం హీరో అయ్యాడు. పోయినవారం సోనియాను నిర్భయంగా ఢీకొట్టి హీరోగా నిలిచిన యష్మి.. మణికంఠపై చేసిన చులకన కామెంట్ల వల్ల తన స్థాయి తగ్గించుకుంది. అటు విష్ణుప్రియ సైతం.. నోటికి ఎంతొస్తే అంత వాగేస్తోంది.

మీకే అంకితం..
దీంతో ఆడాళ్ల నోటిదురుసు ఎక్కువవుతోందని భావించిన నాగ్‌ దానికి కళ్లెం వేయమని వార్నింగ్‌ ఇచ్చాడు. శనివారం ఎంత కోప్పడ్డా సరే సండే రోజు మళ్లీ మామూలు స్థితికి వచ్చేసి ఫన్‌ గేమ్స్‌ ఆడిస్తుంటాడు. ఈ క్రమంలోనే మీకే అంకితం అన్న గేమ్‌ ఆడించాడు. అలాగే ఏదైనా అంకితం ఇచ్చేటప్పుడు చెంపదెబ్బ కొట్టాలన్నాడు. హౌస్‌లో లౌడ్‌ స్పీకర్‌ విష్ణుప్రియ అని, మణికంఠ విక్టిమ్‌ కార్డ్‌ వాడతాడని, పృథ్వీ అటెన్షన్‌ సీకర్‌ అని చెప్తూ మిగతా కంటెస్టెంట్లు వారిని గట్టిగా కొట్టారు.

పృథ్వీ అటెన్షన్‌ సీకర్‌
ఏ లక్ష్యం లేనివారు? ఎవరు? అన్న చీటి నిఖిల్‌కు రాగా.. దాన్ని ఎవరికి అంకితం ఇవ్వాలో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. దీనికి బదులుగా ఇంకో చీటి తీసుకుంటానన్న నిఖిల్‌.. తీరా మరో చిట్టీ తీశాక.. దానికంటే మొదటిదే నయమన్నాడు. ఇక్కడ కూడా సేఫ్‌ ప్లే అని నాగ్‌ సెటైర్లు వేశాడు. ఈరోజు హౌస్‌మేట్స్‌ అందరూ రెట్రో లుక్‌లో కనిపించడం విశేషం

 

Advertisement
 
Advertisement
Advertisement