ఎప్పుడో, ఎవరో ట్రోల్‌ చేసినదాని గురించి ఇప్పుడెందుకు?: నాగార్జున | Bigg Boss Telugu 8: Nagarjuna Reviews Contestants Gameplay | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ప్లేటు తిప్పిన మణి.. నాతో గేమ్స్‌ వద్దంటూ నాగ్‌ వార్నింగ్‌

Oct 12 2024 4:36 PM | Updated on Oct 13 2024 9:53 AM

Bigg Boss Telugu 8: Nagarjuna Reviews Contestants Gameplay

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ (పాత కంటెస్టెంట్లు) ఎవరో చెప్పండని నాగార్జున హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో తేజ.. పృథ్వీ పేరు, హరితేజ.. నబీల్‌, గంగవ్వ.. మణికంఠ, రోహిణి.. ప్రేరణ, నయని.. విష్ణుకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదన్నారు.

రైజింగ్‌ స్టార్స్‌ ఎవరంటే?
అలాగే రాయల్‌ టీమ్‌లో కూడా హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్ల పేర్లను సూచించమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నబీల్‌.. గౌతమ్‌ పేరు చెప్పాడు. ఇకపోతే మరో ప్రోమోలో నాగ్‌.. రైజింగ్‌ స్టార్‌, ఫాలింగ్‌ స్టార్‌ అంటూ ఓ బోర్డు ముందు పెట్టాడు. మెహబూబ్‌, హరితేజ, మణికంఠ, అవినాష్‌, గంగవ్వను రైజింగ్‌ స్టార్లుగా పేర్కొంటూ నబీల్‌, తేజ, విష్ణుప్రియ, గౌతమ్‌ను ఫాలింగ్‌ స్టార్స్‌గా అభివర్ణించాడు.

 ఇప్పుడెందుకు?
ఈ సందర్భంగా ఎప్పుడో, ఎవడో ట్రోల్‌ చేసినదాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావ్‌.. అశ్వత్థామ 2.0 అనేది నువ్వు పెట్టుకున్నావా? లేదా మేము పెట్టామా? అని గౌతమ్‌ను సూటిగా ప్రశ్నించాడు. అటు తేజ.. నయనిపావనితో ర్యాష్‌గా మాట్లాడిన వీడియో చూపించి మరీ తేజకు క్లాస్‌ పీకాడు. రోహిణి తనను బచ్చా అనడంతో మణికంఠ ఫీలైన విషయాన్ని కూడా నాగ్‌ ప్రస్తావించాడు. 

అమాయకంగా ఫేస్‌ పెట్టిన మణి
రోహిణి.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా? అని సెటైరికల్‌గా అడిగాడు. తన శక్తిసామర్థ్యాలను నువ్వు అవమానించావని అనుకున్నాడు అని పేర్కొన్నాడు. అందుకు మణి నోరు తెరుస్తూ.. అమ్మో, అంత పెద్ద మాట అన్లేదు సర్‌ అని అమాయకంగా అన్నాడు.

నాతో గేమ్స్‌ వద్దు
దీంతో నాగ్‌.. ఫీలయ్యావన్నదే చెప్పాను.. ఇప్పుడు కవరింగ్‌ వద్దు, నాతో గేమ్స్‌ ఆడొద్దు అని సీరియస్‌ అయ్యాడు. ఇక విష్ణును నువ్వు గేమ్‌ సీరియస్‌గా తీసుకోకపోతే ఆడియన్స్‌ కూడా నిన్ను సీరియస్‌గా తీసుకోరని తెలిపాడు. నబీల్‌.. మనుషుల ఎదుట కాకుండా వారి వెనకాల మాట్లాడటం ఏమాత్రం బాగోలేదన్నాడు.

 

 మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement