నీ క్యారెక్టర్‌ కనిపిస్తోంది.. విష్ణుపై నాగార్జున సీరియస్‌ | Bigg Boss Telugu 8: Nagarjuna Reveals Rohini, Vishnupriya Mistakes | Sakshi
Sakshi News home page

తప్పు ఒప్పుకోని విష్ణు.. క్యారెక్టర్‌ కనిపిస్తోందంటూ నాగార్జున చీవాట్లు

Nov 23 2024 7:12 PM | Updated on Nov 23 2024 7:33 PM

Bigg Boss Telugu 8: Nagarjuna Reveals Rohini, Vishnupriya Mistakes

నాగార్జున వచ్చీరావడంతోనే విష్ణుప్రియ- రోహిణిల గొడవపై స్పందించాడు. ఇద్దర్నీ కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేశాడు. నీ ప్లాన్‌ వర్కవుట్‌ అయింది.. అందుకు ఉన్నావ్‌ అని రోహిణి అనగా నీ క్యారెక్టర్‌ తెలుస్తోందని విష్ణు రిప్లై ఇచ్చింది. క్యారెక్టర్‌ అనే మాట చాలా పెద్దది అని నాగార్జున చెప్తుంటే.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు.. అది తప్పే కాదని వాదించింది విష్ణు.

నీ క్యారెక్టర్‌ కనిపిస్తోంది
దీంతో నాగ్‌.. ఆ పదం వాడకుండా ఉండాల్సింది.. అక్కడ నీ క్యారెక్టర్‌ కనిపిస్తోంది అని విమర్శించాడు. నిఖిల్‌కు ట్రై చేసి, కుదరకపోవడంతో విష్ణు.. పృథ్వీకి ట్రై చేసిందని.. అదంతా ప్లాన్‌ అని రోహిణి అనడాన్ని కూడా నాగ్‌ తప్పుపట్టాడు. ఈ విషయంలో ఎవరిది తప్పు? అని హౌస్‌మేట్స్‌ అభిప్రాయాన్ని తీసుకున్నాడు.

తప్పు ఒప్పుకోని విష్ణు
ప్లాన్‌ అనడం రోహిణిదే తప్పని అవినాష్‌ అనగా.. ప్లాన్‌ కంటే క్యారెక్టర్‌ అనేది పెద్ద పదం కాబట్టి విష్ణుదే తప్పని ప్రేరణ అభిప్రాయపడింది. అక్కడ కూడా విష్ణు మళ్లీ సంజాయిషీ ఇచ్చుకోవడంతో నాగ్‌ తనను సైలెంట్‌ అయిపోమన్నాడు. ఇక్కడ తప్పు ఇద్దరిదీ ఉంది.. కానీ విష్ణు వాడిన పదాల వల్ల తన గోయి తనే తవ్వుకున్నట్లయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement