బిగ్‌బాస్‌: నామినేషన్స్‌లో ఆరుగురు.. ఎవరెవరంటే? | Bigg Boss Telugu 8: Eighth Week Nominations List | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ఆమెను సేవ్‌ చేసిన గౌతమ్‌.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

Oct 21 2024 5:03 PM | Updated on Oct 21 2024 5:22 PM

Bigg Boss Telugu 8: Eighth Week Nominations List

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ మొదలైందే పద్నాలుగో మందితో! అందులో ఆరుగుర్ని పంపించేశాక ఎనిమిది మంది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను దింపారు. అప్పటినుంచి ఆట రసవత్తరంగా మారింది. అయితే వైల్డ్‌ కార్డులు వచ్చిన తర్వాత కూడా పాత కంటెస్టెంట్లు సీత, మణికంఠ ఎలిమినేట్‌ అయ్యారు. నిజానికి ఇందులో మణికంఠకు బదులు గౌతమ్‌ వెళ్లిపోవాల్సింది.

కానీ ఆరోగ్యం సహకరించడం లేదంటూ మణి స్వతాహాగా బయటకు వచ్చేశాడు. ఇక గౌతమ్‌ మెగా చీఫ్‌ కావడంతో ఎనిమిదో వారం నామినేషన్స్‌ నుంచి బతికిపోయాడు. ఈ వారం నిఖిల్‌, ప్రేరణ, పృథ్వీ, విష్ణు, మెహబూబ్‌, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారట.. గౌతమ్‌ తనకున్న పవర్‌తో హరితేజను నామినేషన్స్‌లో నుంచి సేవ్‌ చేసినట్లు సమాచారం! మరి ఈ ఆరుగురిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారు? ఎవరు సేవ్‌ అవుతారనేది చూడాలి!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement