'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్! | Sakshi
Sakshi News home page

Bigg Boss Promo: 'తూ.. అంటూ మండిపడ్డ ప్రియాంక.. నేనంటే నీ బతుకు ఏం కావాలా?'

Published Tue, Oct 17 2023 1:23 PM

Bigg Boss Promo latest Episode Released  Today  - Sakshi

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది.  ప్రస్తుతం మొదటిరోజే ఏడుగురు నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన వారు ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో నామినేట్ చేయనున్నారు. తాజాగా ఈ రోజుకు సంబంధించిన ఎపిసోడ్‌ ప్రోమో రిలీజైంది. 

ప్రోమోలో శోభాశెట్టి మాట్లాడుతూ..'తేజ నువ్వు పనిష్మెంట్‌ అనేది చాలా సిల్లీగా తీసుకుంటున్నావ్. ఈరోజు కూడా వెళ్తా. నేను వీఐపీ గదిలోనే ఉంటా. అది నా ఇష్టం' అని చెప్పింది. దీనికి టేస్టీ తేజ రిప్లై ఇస్తూ.. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్‌ బ్రో అని చెప్పాడు. ప్రతిదీ నీకు ఫన్‌.. కానీ మాకే సీరియస్‌గా అనిపిస్తోందని చెప్పింది శోభాశెట్టి.

(ఇది చదవండి: ఇకపై అన్నీ ఆనంద క్షణాలే..: రాశీ ఖన్నా)

ఆ తర్వాత ప్రియాంక జైన్‌, శోభాశెట్టిని ఉద్దేశించి.. 'మీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తోందిరా? ఆడపిల్లలు.. మీకు మంచి భవిష్యత్తు ఉంది అని భోలె షావలి కాస్తా వెటకారంగా' అన్నారు. దీనికి కోపం తెచ్చుకున్న ప్రియాంక జైన్.. 'ఆడపిల్ల అంటూ నటించినవ్ కదా.. ఇంతసేపు కనిపిస్తోంది' అంటూ భోలే షావలిపై మండిపడింది.  ఆ తర్వాత నీలాంటోళ్లను చాలామందిని చూసినా అని భోలె షావలి అనడంతో.. కోపంతో ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత షావలి అరే ఎంత మంచిగా ఉన్నా నేను' అంటాడు. కానీ ప్రియాంక్ మాట్లాడుతూ..'నువ్వు నటించావ్' అంటుంది.  ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ.. 'పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు కంట్రోల్ యువర్ టంగ్ అంటూ భోలె షావలికి వార్నింగ్ ఇస్తుంది'. అనంతరం తూ.. అని ప్రియాంక జైన్‌ అనడంతో.. నేను అదే తిరిగి అంటే నీ బతుకు ఏం కావాలా? అంటాడు భోలె షావలి. ఆ తర్వాత శోభాశెట్టి అతన్ని నామినేట్ చేస్తూ కుండ పగలగొడుతుంది.

ఇక టేస్టీ తేజ శోభాశెట్టితో మాట్లాడుతూ.. రూమ్‌లో ఉన్న వాళ్లందరు నామినేట్ చేయడం ఒక ఎత్తు.. నువ్వు నా కుండ పగలగొట్టడం ఒక ఎత్తు అంటూ అక్కడి నుంచి వెళ్లి పోవడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ మరింత హీటెక్కినట్లు కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు సీరియస్‌గా విమర్శలు చేసుకుంటూ మరింత ఆసక్తికరంగా మార్చేశారు. ప్రోమో చూస్తే ఓవరాల్‌గా ఈ రోజు ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన్ ప్రక్రియని పూర్తి చేయనున్నారు.

(ఇది చదవండి: నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్‌ అగ్రిమెంట్‌ గుట్టు విప్పిన అర్జున్‌ కల్యాణ్‌)

Advertisement
 
Advertisement