అమర్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన శోభ.. అతడి కోసం త్యాగం.. | Bigg Boss Fame Shobha Shetty Surprise Gift To Amardeep Chowdary, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Shobha Shetty: స్టార్‌ హీరో ఇచ్చిన గిఫ్ట్‌.. ఫ్రెండ్‌ కోసం త్యాగం!

Published Fri, Feb 9 2024 7:30 PM

Bigg Boss Fame Shobha Shetty Surprises Amardeep Chowdary - Sakshi

బిగ్‌బాస్‌ షోను డీల్‌ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కంటెస్టెంట్లను మెచ్చుకోవాలి. తప్పు చేసినవారిని సరిచేయాలి.. వారి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ రప్పించాలి.. ఎపిసోడ్‌ను జోష్‌గా ఉంచాలి.. ప్రేక్షకులు షో చూడగలిగేలా చేయాలి.. ఇలా చాలానే ఉంటాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా సరే బిగ్‌బాస్‌ను ఓ బాధ్యతగా భుజానెత్తుకున్నాడు కింగ్‌ నాగార్జున. వరుసగా ఐదు సీజన్లకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎనిమిదో సీజన్‌కు కూడా ఆయనే యాంకర్‌గా ఉంటాడు. ఇందులో డౌటే లేదు.

శోభాకు టీషర్ట్‌ గిఫ్ట్‌
కాకపోతే నాగ్‌ ఎక్కువగా కోప్పడడు. అలాంటిది ఏడో సీజన్‌లో మాత్రం ఉగ్రరూపాన్ని చూపించాడు. ఒక్కొక్కరు మారు మాట్లాడకుండా చేశాడు. అమ్మాయిలను మాత్రం సుతిమెత్తగానే వారించేవాడు. ఓ రోజు శోభా శెట్టి నాగ్‌ ధరించిన టీ షర్ట్‌ చూసి ముచ్చటపడింది. అది కావాలని మనసులో మాట బయటపెట్టింది. అంత ప్రేమగా అడిగితే మన్మథుడు కాదంటాడా? షో అయిపోయిన వెంటనే ఆ టీ షర్ట్‌ను ఇచ్చేశాడు. కానీ అదే షోలో అమర్‌దీప్‌ అడిగితే మాత్రం నీకు ఇచ్చేదేంటన్నట్లుగా చూశాడు.

ఫ్రెండ్‌ కోసం త్యాగం
ఇక షో అయిపోయాక ఆ టీషర్ట్‌ ధరించి ఫోటోషూట్‌ కూడా చేసింది శోభ. అయితే స్నేహితుడి కోరిక గుర్తొచ్చి అతడి కోసం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నాగార్జున తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన టీషర్ట్‌ను ఓ షోలో అమర్‌కు త్యాగం చేసింది. 'ఇది నాకెంతో విలువైన బహుమతి. కానీ ఆరోజు అమర్‌ నాగ్‌ సర్‌ను అడిగాడు, కాబట్టి ఇది తనకు ఇచ్చేస్తున్నా' అని చెప్పింది. అది తీసుకుని మురిసిపోయిన అమర్‌ స్టేజీపైనే దాన్ని ధరించి సంబరపడ్డాడు. ఇది చూసిన జనాలు శోభను మెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్‌ అంటే నీలా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: షారుక్‌ ఖాన్‌ అంత ఆస్తి లేదు, భరణం ఎంతిచ్చానంటే?

Advertisement
 
Advertisement