'మొదటి భార్యకు విడాకులు.. నన్ను ఇలాగే చావనివ్వండి' | Saif Ali Khan Opened Up About Being In An Abusive Marriage With Amrita Singh, Says Let Me Die Of Shame - Sakshi
Sakshi News home page

Saif Ali Khan: షారుక్‌ ఖాన్‌ అంత ఆస్తి లేదు, అయినా నాకు వచ్చే ప్రతి పైసా వారికే..

Published Fri, Feb 9 2024 4:54 PM

Saif Ali Khan Being in an Abusive Marriage with Amrita Singh: Let me Die of Shame - Sakshi

బాలీవుడ్‌లోని ఫేమస్‌ జంటల్లో సైఫ్‌ అలీ ఖాన్‌- కరీనా కపూర్‌ జోడీ ఒకరు. అయితే కరీనాను పెళ్లాడటానికంటే ముందు సైఫ్‌కు నటి అమృతా సింగ్‌తో పెళ్లయింది, పిల్లలు పుట్టారు, తర్వాత విడాకులూ తీసుకున్నారు. తాజాగా అతడి పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారింది. 2005లో అతడు ఆ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విడాకులు తీసుకున్నప్పుడు నన్ను, నా తల్లిని, సోదరిని దుర్భాషలాడారు. అవమానించారు. మానసికంగా వేధించారు. అన్నింటినీ భరించాను.

అందులో తప్పేముంది?
నెమ్మదిగా దాని నుంచి బయటపడ్డాను. తర్వాత నేను మళ్లీ ప్రేమలో పడితే కూడా తప్పేనా? (విడాకుల అనంతరం సైఫ్‌ నటి రోసాను డేటింగ్‌ చేశాడు) దానివల్ల ఎవరికి హాని ఉంది? మేము విడిపోయిన తర్వాత కూడా పిల్లలను ఎప్పుడూ పట్టించుకోకుండా వదిలేయలేదు. అలా అని కస్టడీ కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ తనతో పోరాడాలనీ అనుకోలేదు. కానీ ఎప్పుడూ వారికి అండగా ఉన్నాను. అమృతకు రూ.5 కోట్లు భరణం ఇచ్చేందుకు అంగీకరించాను. అందులో సగాన్ని ఆల్‌రెడీ చెల్లించేశాను.

అంత ఆస్తి లేదు
దానితోపాటు ఇబ్రహీంకు 18 ఏళ్ల వయసొచ్చేవరకు నెలకు రూ.1 లక్ష చొప్పున ఇస్తానని చెప్పాను. షారుక్‌ ఖాన్‌లా అంత పెద్ద సంపద నాకు లేదు. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి వారికి ఇస్తానన్న డబ్బును సమయానికి ఇచ్చేసేవాడిని. యాడ్స్‌, స్టేజీ షోలు, సినిమాల ద్వారా వచ్చే ప్రతి పైసాను వారికే అంకితం చేశాను. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఇలాగే చావనివ్వండి.. అంతేకానీ, ఒక బంధంలో నుంచి ఇంత ఈజీగా వచ్చేశావేంటంటూ పదేపదే ఎత్తిపొడుపు మాటలతో నన్ను పదే పదే పొడిచి చంపొద్దు ప్లీజ్‌..' అని చెప్పుకొచ్చాడు.

రెండు పెళ్లిళ్లు
కాగా సైఫ్‌- అమృత 1991లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్‌, ఇబ్రహీమ్‌ అలీ ఖాన్‌ సంతానం. పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైన అమృత విడాకుల తర్వాత వెండితెరపై మళ్లీ బిజీ నటిగా మారింది. 2004లో భార్యతో విడిపోయిన తర్వాత సైఫ్‌ నటి రోసాతో ప్రేమలో పడ్డాడు. కానీ కొంతకాలానికే బ్రేకప్‌ చెప్పుకున్నారు. అనంతరం హీరోయిన్‌ కరీనా కపూర్‌ను ప్రేమించాడు. 2012లో ఆమెను పెళ్లాడాడు. వీరికి తైమూర్‌, జే అని ఇద్దరు కుమారులు జన్మించారు.

చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన స్టార్‌ హీరోల సినిమాలు.. సలార్‌ హిందీ వర్షన్‌ ఆరోజే రిలీజ్‌!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement