వివాదాస్పద నటితో పెళ్లి-విభేదాలు.. ఇప్పుడు రెండో షాదీ.. | Bigg Boss Fame Rakhi Sawant Ex Husband Adil Khan Durrani Marries Somi Khan | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్‌..

Mar 8 2024 2:15 PM | Updated on Mar 8 2024 2:58 PM

Bigg Boss Fame Rakhi Sawant Ex Husband Adil Khan Durrani Marries Somi Khan - Sakshi

మరోవైపు అదిల్‌ ఖాన్‌ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. హిందీ బిగ్‌బాస్‌(12వ సీజన్‌) కంటెస్టెంట్‌ సోమి ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. అయితే ఇది తనకు రెండో పెళ్లి కాదని, మొదటి పెళ్లం

బిగ్‌బాస్‌ షోతో బాగా క్లిక్‌ అయింది రాఖీ సావంత్‌. అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటుందీ నటి. గతంలో ఈమె రితేశ్‌ సింగ్‌ను పెళ్లాడింది. ఆల్‌రెడీ అతడికి పెళ్లైన విషయం ఆలస్యంగా తెలియడంతో ఆమె మనసు ముక్కలైంది. అతడికి పెళ్లాంపిల్లలు ఉన్నందున తన పెళ్లి చెల్లదంటూ రితేశ్‌తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్‌ దురానీతో ప్రేమలో పడింది.

అతడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఆ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. కానీ వీరి బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. గొడవలు పీక్స్‌కు వెళ్లడంతో భర్తను జైల్లో పెట్టించింది. అతడితోనూ విడిపోయింది. ఆమధ్య మరోసారి ప్రేమలో పడ్డానంది కానీ దాని గురించి మళ్లీ మాట్లాడనేలేదు. మరోవైపు అదిల్‌ ఖాన్‌ రెండోసారి పెళ్లిపీటలెక్కాడు. హిందీ బిగ్‌బాస్‌(12వ సీజన్‌) కంటెస్టెంట్‌ సోమి ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. ఏడు నెలలుగా ఆమెతో ప్రేమలో ఉన్న అతడు చివరకు పెళ్లితో ఒక్కటైనట్లు తెలుస్తోంది. అయితే ఇది తనకు రెండో పెళ్లి కాదని, మొదటి పెళ్లని చెప్తున్నాడు.

అదెలాగో తర్వాతి రోజుల్లో చెప్తానంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నామని, ముంబైకి రాగానే అన్ని విషయాలు వివరంగా వెల్లడిస్తానంటున్నాడు. అదిల్‌- సోమి ఖాన్‌ వివాహం మార్చి 3న జరిగింది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలను అదిల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమను ఆశీర్వదించమని కోరాడు. ఇది చూసిన జనాలు.. రాఖీతో ఎంగేజ్‌మెంట్‌.. షాదీ.. బ్రేకప్‌ జరిగిపోయాయి. అంతలోనే మళ్లీ పెళ్లి చేసుకున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఎంతటి విషాదం.. క్యాన్సర్‌తో నటి కన్నుమూత.. ముందురోజే సోదరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement