శివాజీ ఎమోషనల్ వీడియో.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్! | Sakshi
Sakshi News home page

Shivaji : 'వాళ్లందరి ముందు నేను ఏడవలేకపోతున్నా'..శివాజీపై దారుణ ట్రోల్స్!

Published Sat, Oct 28 2023 11:41 AM

Bigg Boss Telugu 7: Contestant Shivaji Emotional Video, Netizens Trolled Him - Sakshi

తెలుగువారి రియాటిటీ షో బిగ్‌బాస్‌ సీజన్-7 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఈ షో 54 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది. అయితే అందరూ పెద్దన్నగా అడుగుపెట్టిన శివాజీ అదే పాత్రను హౌస్‌లో చక్కగా పోషిస్తున్నారు. ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్ యావర్‌కు మద్దతుగా నిలుస్తున్నాడని నెటిజన్స్ కూడా చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఈ షో  మొదలై ఏడు వారాలు పూర్తి కాగ.. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారంలో మరొక కంటెస్టెంట్ ఇంటిదారి పట్టేందుకు రెడీగా ఉన్నారు. 

(ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?)

శివాజీ చేతికి గాయం

అయితే గతంలో శివాజీ చేతికి గాయం కావడంతో చికిత్స అందించారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో శివాజీ మాట్లాడిన ఓ వీడియోను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో శివాజీ మాట్లాడుతూ ఫుల్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. 'ఎవరు లేకపోతే నేనే ఏడుస్తున్నా. ఎవరైనా ఉంటే నవ్వుతూ లోపల ఏడుస్తున్నా. వాళ్లందరి ముందు నేను ఏడవలేకపోతున్నా. ఎందుకంటే అది నాకు చాలా బరువుగా ఉంది.' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇదంతా చూసిన నెటిజన్స్‌ కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ పెడితే.. మరికొందరేమో చాలా దారుణంగా ట్రోల్ చేశారు. 

ఓ నెటిజన్ రాస్తూ.. శివాజీ పెద్ద కన్నింగ్ ఫెలో అంటూ పోస్ట్ చేశారు. నిజంగానే శివాజీ అన్న పెద్ద యాక్టర్‌ అంటూ కామెంట్ చేశాడు. బయట జరుగుతున్నవి తెలిస్తే శివాజీ అన్న ఏమైపోతాడో ‍‍అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. సింపథీ స్టార్, కన్నింగ్ ఫెలో అని ఒకరంటే.. చాలు చాలు.. ఇక ఓవరాక్షన్‌ ఆపు అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. కాగా.. ఈ వారంలో హౌస్‌లో నామినేట్‌ అయినవారిలో శివాజీ కూడా ఉన్నారు. అయితే తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి, సందీప్ చివరి రెండుస్థానాల్లో నిలిచారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. 

(ఇది చదవండి: ప్రశాంత్‌, శివాజీ ముందే ప్లాన్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement