జవాన్‌ సినిమాలో బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఇచ్చిపడేసిందిగా! | This Bigg Boss Beauty Cameo Role In Jawan Movie | Sakshi
Sakshi News home page

Jawan Movie: జవాన్‌ సినిమాలో ఏకైక తెలుగు నటి.. గోల్డెన్‌ ఛాన్సే పట్టేసిందే!

Sep 7 2023 3:48 PM | Updated on Sep 7 2023 4:43 PM

This Bigg Boss Beauty Cameo Role In Jawan Movie - Sakshi

ఈ తెలుగు బ్యూటీ షారుక్‌ పక్కనే కనిపించింది. జైలర్‌ ఆజాద్‌గా షారుక్‌ నటించగా, ఆయనకు సబ్‌ ఆర్డినేట్‌ ఆఫీసర్‌గా..

పఠాన్‌ సినిమాతో బాక్సాఫీస్‌ రికార్డుల దుమ్ము దులిపాడు షారుక్‌ ఖాన్‌. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. తన నుంచి మరో సినిమా వస్తుందంటే అందరి అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆ రేంజ్‌కు తగ్గట్లే సౌత్‌ డైరెక్టర్‌ అట్లీ ఓ కథ సిద్ధం చేసుకుని వినిపించగా షారుక్‌కు కూడా తెగ నచ్చేసింది. ఇంకేముంది జవాన్‌ సినిమా మొదలైంది. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార జవాన్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. దీపికా పదుకోణ్‌ ముఖ్య పాత్రలో మెరిసింది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్‌ నుంచి ఏ ఒక్కరూ లేరే అన్న లోటును తీర్చేసిందో బ్యూటీ.

బిగ్‌బాస్‌ బ్యూటీ సిరి హన్మంతు జవాన్‌ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఇందులో ఆమె పాత్రకు డైలాగులు లేవు కానీ, షారుక్‌ పక్కనే కనిపించింది. జైలర్‌ ఆజాద్‌గా షారుక్‌ నటించగా, ఆయనకు సబ్‌ ఆర్డినేట్‌ ఆఫీసర్‌గా సిరి కనిపించింది. బాలీవుడ్‌ సినిమాలో బిగ్‌బాస్‌ బ్యూటీ చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదంటున్నారు నెటిజన్లు.

బిగ్‌బాస్‌ ద్వారా మూటగట్టుకున్న నెగెటివిటీని ఈ బ్యూటీ తన అందం, ప్రతిభ ద్వారా వచ్చిన ఆఫర్లతో తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. తమిళ దర్శకుడు అట్లీ కూడా జవాన్‌లో చిన్న పాత్రలో మెరిశారు. ఇకపోతే జవాన్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తున్న నేపథ్యంలో షారుక్‌ గత సినిమా రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు. మరి ఈ మూవీ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

చదవండి: జవాన్‌ సినిమా ఓటీటీ రైట్స్‌కు రికార్డు ధర.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు ఛాన్స్‌! మిస్‌ శెట్టి కూడా అక్కడే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement