మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి, జవాన్‌.. రెండు సినిమాలు ఒకే ఓటీటీలో! | Miss Shetty Mr. Polishetty And Jawan Movie Will Be Streaming On This OTT Platform - Sakshi
Sakshi News home page

OTT: జవాన్‌ సినిమా ఓటీటీ రైట్స్‌కు రికార్డు ధర.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు ఛాన్స్‌! మిస్‌ శెట్టి కూడా అక్కడే..

Published Thu, Sep 7 2023 2:23 PM

Miss Shetty Mr Polishetty And Jawan Movie Will Be Streaming On This OTT Platform - Sakshi

అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్‌ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్‌, మురళీ శర్మ, జయసుధ, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు పాజిటివ్‌ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాకు టఫ్‌ కాంపిటీషన్‌ ఇచ్చేందుకు మరో భారీ సినిమా కూడా థియేటర్లలో విడుదలైంది. అదే జవాన్‌.

జవాన్‌.. బోలెడన్ని ప్రత్యేకతలు
ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ దీనికి దర్శకత్వం వహించడం, లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం, క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం, తమిళ స్టార్‌ విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే అతిథి పాత్రలో మెరవడం.. ఇలా చాలానే ఉన్నాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా నేడే విడుదలవగా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు ఈపాటికే ఓటీటీ పార్ట్‌నర్స్‌తో డీల్‌ కుదుర్చుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ రూ.120 కోట్లు పెట్టి మరీ జవాన్‌ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి, జవాన్‌.. రెండు సినిమాల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

రెండూ ఒకే ఓటీటీలో
సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఫ్లాప్‌ టాక్‌ వచ్చిందంటే అంతకంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షమైపోతున్నాయి. హిట్‌ టాక్‌ వస్తే కొంతకాలం ఆగిన తర్వాతే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. అంటే, ఈ రెండు సినిమాల ఫలితాన్ని బట్టే ఓటీటీ విడుదల ఖరారు కానుంది. మిస్‌ శెట్టి.. సెప్టెంబర్‌ నెలాఖరులో లేదంటే  అక్టోబర్‌ నెల ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది! జవాన్‌ మాత్రం అక్టోబర్‌ చివర్లో రిలీజయ్యేట్లు కనిపిస్తోంది.

చదవండి: 'జవాన్‌' మూవీ రివ్యూ
‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’మూవీ రివ్యూ

Advertisement
 
Advertisement