బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై? | Bigg Boss 8 Telugu Ninth Week Elimination Updates | Sakshi
Sakshi News home page

Bigg Boss8 Elimination: గతవారం మెహబూబ్.. మరి ఈసారి ఆమె పక్కానా?

Nov 2 2024 8:51 AM | Updated on Nov 2 2024 9:19 AM

Bigg Boss 8 Telugu Ninth Week Elimination Updates

బిగ్‌బాస్ 8లో తొమ్మిదో వారం చివరకొచ్చేసింది. ఈసారి గౌతమ్, యష్మి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేషన్స్‌లో నిలిచారు. ఈసారి మెగా చీఫ్ అయ్యేందుకు బిగ్‌బాస్ పలు పోటీలు పెట్టాడు. అవినాష్ మెగాచీఫ్ అయ్యాడు. అలానే పానిపట్టు అనే టాస్క్‌లో జోష్ చూపించిన యష్మి.. ఓటింగ్‌లోనూ మంచి జోరు చూపించింది. ఈ వారం టాప్‌లో నిలిచింది. కానీ ఇప్పుడు ఈమె ప్లేస్ మారినట్లు తెలుస్తోంది.

ఈసారి ఐదుగురు నామినేషన్స్‌లో ఉండగా.. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఆన్‌లైన్ పోలింగ్ ప్రకారం గౌతమ్ తొలి స్థానంలోకి వచ్చాడట. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న యష్మి రెండో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల ముందు వరకు మూడు, నాలుగు, స్థానాల్లో ఉన్న టేస్టీ తేజ, హరితేజ, నయని పావని ప్లేసులు మారాయట.

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలీరెడ్డి)

చివరలో ఉన్న నయని.. ఓటింగ్ ముగిసే సమయానికి మూడులోకి వచ్చిందట. నాలుగులో టేస్టీ తేజ, ఐదులోకి హరితేజ వెళ్లారట. అంటే చివరి రెండు స్థానాల్లో టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. లెక్క ప్రకారమైతే వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ హరితేజ లేదా నయని పావని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

నామినేషన్స్‌లో ఉన్నవాళ్లలో గౌతమ్, యష్మి, టేస్టీ తేజ మంచిగా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. వీళ్లతో పోలిస్తే నయని, హరితేజ మాత్రం అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. దీంతో వీళ్లిద్దరిలో ఒకరు ఈసారి బయటకెళ్లడం పక్కా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య)

Advertisement
 
Advertisement
Advertisement